పెద రాయుడు చిన్నోడు.. హీరోగా వస్తున్నాడు.. సూపర్ హిట్ కొట్టేనా?

పెద రాయుడు.మోహన్ బాబు నటించిన ఈ సినిమా ఒకప్పుడు సంచలన విజయాన్ని అందుకుంది.

 Do You Know The Details Of Peda Rayudu Child Artist Master Mahendran Details, Pe-TeluguStop.com

ఈ సినిమానో ఓ రేంజిలో తీశాడు దర్శకుడు.ఒకానొక సమయంలో ఈ సినిమాలో పెద రాయుడు తీర్పు చెప్పేందుకు కీలక సాక్ష్యం చెప్తాడు ఓ చిన్నోడు.

చిన్నచెడ్డీ, ఒంటికి బనియన్ ఏసుకున్న బుడ్డోడు ముందుకొచ్చి.జరిగిన విషయం చెప్తాడు.

దీన్ని ఆసరాగా చేసుకుని పెద రాయుడు అద్భుత తీర్పు చెప్తాడు.ఈ నేరం చేసింది తన చెల్లి కొడుకే అయినా.

న్యాయం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ చారిత్రాత్మక తీర్పు వెల్లడిస్తాడు.

ఆ పిల్లాడు మరెవరో కాదు.

మాస్టర్ మహేంద్రన్.చిన్న పిల్లాడిలా పెద రాయుడు సినిమాలో యాక్ట్ చేసిన ఈ అబ్బాయి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

తమిళంలో ఈయన నటించిన సినిమాను అర్థం పేరుతో తెలుగులోకి డబ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇప్పటికే ఈ కుర్రాడికి తెలుగు జనాల్లో మంచి గుర్తింపు ఉంది.

అందుకే ఈ సినిమా ఇక్కడ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్లు సినీ జనాలు భావిస్తున్నారు.

ఇప్పటికే అర్థం సినిమా మోషన్ పోస్టర్ ను రిపబ్లిక్ మూవీ దర్శకుడు దేవ కట్టా రిలీజ్ చేశాడు.

Telugu Artham Poster, Artham, Devakatta, Mohan Babu, Peda Rayudu, Pedarayudu, Sh

సినిమా టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఈ సినిమాలో మహేంద్రన్ తో పాటు శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ సినిమాను మణికాంత్ తళ్లగూటి తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాలో మహేంద్రన్ ఏ పాత్ర పోషించబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.అయితే సినిమా పోస్టర్ మాత్రం చాలా క్రియేటివ్ గా కనిపించింది.

Telugu Artham Poster, Artham, Devakatta, Mohan Babu, Peda Rayudu, Pedarayudu, Sh

తెలుగులోనే కాదు పలు సినిమాల్లోనే బాల నటులుగా సినిమాల్లోకి అడుగు పెట్టిన వారంతా.ప్రస్తుతం హీరోలుగా పరిచయం అవుతున్నారు.సక్సెస్ ఫుల్ సినిమాలు కూడా చేస్తున్నారు.

అందరిలాగే మహేంద్రన్ కూడా మంచి హిట్ కొడతాడనే చెప్తున్నారు సినీ జనాలు.ఈ సినిమాకు సంబంధించిన పలు వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube