కమెడియన్ ఆలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు జనాలు.ఇక వాళ్ళ ఆస్తుల గురించి మాత్రం బాగా తెలుసుకుంటారు.

 Do You Know The Comedian Ali Whole Properties Details,  Comedian Ali, Tollywood,-TeluguStop.com

ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంటూ ఎవరు ఎంత సంపాదించారో అని తెలుసుకోవడానికి బాగా ఆత్రుత పడుతుంటారు.ఇప్పటికే ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఎన్నో కోట్ల ఆస్తులతో మంచి హోదాలో ఉన్నారు.

నిజానికి ఇండస్ట్రీకి చెందిన నటులు చాలా వరకు ఆస్తిపరులు అవుతారు అని గ్యారెంటీ లేదు.ఎందుకంటే కొందరు నటులు ఇప్పటికి కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొందరు నటులు మాత్రం ముందు చూపుతోనే తాము సంపాదించుకున్న డబ్బులను ఏదైనా వ్యాపారం లో పెట్టడం లేదా ముందుగానే తక్కువ రేటు ఉన్న భూములను కొనుగోలు చేయడం వంటివి చేస్తుంటారు.

అలా ఎంతో మంది ముందు చూపుతోనే జాగ్రత్త పడి ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు.

ఇక మరో కమెడియన్ ఆలీ కూడా ముందు జాగ్రత్తతో బాగా భూములు కొన్నాడట.ఇక ఈయన ఆస్తుల విలువల గురించి తెలిస్తే మాత్రం పక్కా దిమ్మతిరిగిపోతుంది అనే చెప్పవచ్చు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా నిలిచిన అలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Ali Luxury Cars, Ali, Ali Assets, Ali Charitable, Propertys, Tollywood, T

ఈయన 1981లో సీతాకోకచిలుక సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఇక ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.దాదాపు 1100 కి పైగా సినిమాలలో నటించి మంచి స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.ఇక ఈయన బుల్లితెరపై రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.

ఇక ఆలీ నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.తన తండ్రి పేరు మీద మహమ్మద్ భాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేశాడు.

అందులో ఎంతో మంది పేదలకు తన వంతు సహాయం చేస్తున్నాడు.ఇక ఇటీవలే తన స్వచ్ఛంద సేవా సంస్థ పేరు పై తను చేస్తున్న సేవలకు అవార్డు కూడా అందింది.

Telugu Ali Luxury Cars, Ali, Ali Assets, Ali Charitable, Propertys, Tollywood, T

ఇక ఈయన ఆస్తుల గురించి చెప్పాలి అంటే దాదాపు 750 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది.ఈయన నటుడిగా తన సంపాదన ఒక ఏడాదికి ఎనిమిది నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని గతంలో తెలిసింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 2 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని, కొన్ని లక్షల సూపర్ లగ్జరీ కారు ఉందని తెలిసింది.ఈయన ఎక్కువగా భూములు కొనడానికి బాగా ఆసక్తి చూపుతాడట.

తన సొంత ప్రాంతంలో తనకు వ్యవసాయ పొలాలు ఉన్నాయని.తనకున్న ఆస్తి లో పేద ప్రజలకు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు అని తెలిసింది.

దాదాపు వాళ్లకి నెలకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసాడని తెలిసింది.ఆలీ కి ఇంత ఆస్తి ఉన్నా కూడా ఏ రోజు కూడా తనలో పొగరు పెరగలేదని అంటుంటారు.

అందరితో సామాన్య వ్యక్తిగా మాత్రమే కనిపిస్తుంటాడు ఆలీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube