ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే పుట్టుమచ్చలు అనేవి వస్తూ ఉంటాయి.సహజంగా పుట్టుమచ్చల వల్ల ఎలాంటి నష్టం ఉండదు.
కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి అర్థాలు ఏమిటో తెలుసుకుందామా మరి.కొంతమంది జ్యోతిష్య నిపుణులు పుట్టు మచ్చలను చూసే వారికీ అదృష్టం ఉందో లేదో అని ఇట్టే చెప్పేస్తారు.శరీరంలో వివిధ భాగాలలో పుట్టుమచ్చలు వల్ల ప్రయోజనాలు ఉంటాయని వారి నమ్మకం.అంతేకాకుండా ఆడవారికి, మగవారికి పుట్టుమచ్చలు విషయంలో చాలా తేడాలు ఉంటాయని, ఏ పుట్టుమచ్చ వల్ల అదృష్టమో, దేనివల్ల దురదృష్టమో అని తెలపవచ్చు అని పండితులు అంటున్నారు.
మగవారికి కుడి వైపు శరీర భాగాల పై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుందని, అదే ఆడవాళ్ళకు అయితే ఎడమ వైపు శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే చాల మేలు అని పండితులు తెలియజేస్తున్నారు.ఎవరికైనా సరే శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతాలు గుర్తు అని అంటూ ఉంటారు.
ఇలాంటి వారి జీవితంలో మనశ్శాంతి, ఆనందం ఉండదట.ఒకవేళ ఎవరికైనా కుడి కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట, అదే ఎడమ కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు , గొడవలు పెరిగి వల్ల విడిపోతారు అని అందరూ అంటుంటారు.
ఇక ఆడవాళ్ళ ముఖం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అది ప్రేమకు సంకేతం.అదే మగవారి ముఖం పై కుడి వైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టు పై విపరీతమైన నాలెడ్జ్ ఉంటుందట.
అలాగే ముఖం పై కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే సంపద, తెలివితేటలు బాగా ఉంటాయని, అదే ఎడమవైపు ఉంటే నిరాశకు గురి అని పండితులు చెబుతుంటారు.
ఒకవేళ ఎవరికైనా కంటి లోపల పుట్టుమచ్చ ఉంటే వారు సెన్సిటివ్ గా ఉంటారని, చిన్న చిన్న విషయాలను కూడా చాలా లోతుగా స్పందిస్తారని ఉంటారు.
అదే ఎవరైనా సరే ముఖం చుట్టుపక్కల పుట్టుమచ్చ ఉంటే వారి జీవితకాలం ఆనందగా జీవిస్తారట.అలాగే ఎవరికైనా నోట్లో పుట్టుమచ్చ ఉంటే వారు సంపన్నులు అవడంతో పాటు వారికి అదృష్టం కూడా మామూలుగా ఉండదట.
ఇలా నోట్లో లోపల పుట్టుమచ్చ ఉండే వ్యక్తిని ఏ మహిళైనా పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందంగా ఉంటుందట.ఆడవారికైనా, మగవారికైనా ముక్కు లో కానీ ముక్కు పైన కానీ పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా తెలివిగల వాడని వారు, కావడంతో పాటి ఆరోగ్యంగా ఉంటారని పండితులు అంటూ ఉంటారు.