పాలిష్ చేయని బియ్యం తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా..?!  

Do you know the benefits of eating unpolished rice, Rice benefits, rice , health care, health benefits, polished rice , viral latest, anti nutrients, sugar, heart problems - Telugu Anti Nutrients, Health Benefits, Health Care, Heart Problems, Polished Rice, Rice, Rice Benefits, Sugar, Viral Latest

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది రైస్ ని తింటుంటారు.అయితే బియ్యంలో చాల రకాలు ఉంటాయి.

TeluguStop.com - Do You Know The Benefits Of Eating Unpolished Rice

సాధారణంగా మనం తినే బియ్యంలో రెండు రకాలు ఉన్నాయి.ఒక్కటి పాలిష్ చేసిన బియ్యం, రెండు పాలిష్ చేయని బియ్యం.

అయితే చాల మందికి పాలిష్ చేయని బియ్యం ఎలా ఉంటాయో ఎక్కువగా తెలీదు.ఏ బియ్యం అయితే తెలుపు రంగులో ఉండదో అవన్నీ పాలిష్ చేయని బియ్యాపు రంగానికి చెందినవే .

TeluguStop.com - పాలిష్ చేయని బియ్యం తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఒకప్పుడు ప్రజలు దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు.అయితే మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి.

ప్రస్తుతం ప్రజలు పాలిష్ పట్టిన తెల్ల బియ్యాన్ని ఎక్కువగా తింటున్నారు.తెల్ల బియ్యం రుచిగా ఉండటం వల్లే దీనిని తినడానికి ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

అయితే వైద్య నిపుణులు మాత్రం పాలిష్ పట్టిన బియ్యం కంటే పాలిష్ పట్టని బియ్యం తింటేనే మంచిదని చెబుతున్నారు.పాలిష్ పట్టని బియ్యంలో మాత్రమే మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని తెలుపుతున్నారు.పాలిష్ చేయని ముడి బియ్యం పాలిష్ చేసిన తెల్ల బియ్యం మధ్య తేడాలను పరిశీలిస్తే ముడి బియ్యంలో 1.8 గ్రాముల ఫైబర్ లభించగా తెల్ల బియ్యంలో 0.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

ఇక తెల్ల బియ్యం ఎక్కువగా తీసుకునేవారిలో పోషకాహార లోపాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే ముడి బియ్యం ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే యాంటీ న్యూట్రియెంట్లు పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని, ఆర్సెనిక్ వల్ల మధుమేహం, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు.

అంతేకాదు ముడి బియ్యం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రజలు ముడి బియ్యమే ఎక్కువగా తీసుకోవాలని… అయితే మితంగా తీసుకోవాలని ఎత్తుకు కావాల్సిన బరువు ఉండాలనుకునే వారు ముడిబియ్యానికి ప్రాధాన్యతనివ్వడం మంచిదని తెలుపుతున్నారు.

#Rice Benefits #Anti Nutrients #Health Care #PolisheD Rice #Heart Problems

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు