'ఈ-సిమ్‌' ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా?

సిమ్‌ కార్డు అంటే తెలియనివారు ఈ ప్రపంచంలోనే వుండరు.సెల్ ఫోన్లలో ఉపయోగించే SIM (సబ్ స్కైబర్ ఐడెంటిటీ మాడ్యూల్) ఇక కనబడదు.అదేంటి, కనబడకపోతే ఎలా అని అనుకుంటున్నారా? దానికి ప్రత్యామ్నాయమే ‘ఈ-సిమ్‌.’ అవును, సిమ్ కార్డు మొదటిలో పెద్ద సైజు ఉండేది.అక్కడి నుండి నానో, ఆఖరికి మైక్రో సైజుకు వచ్చేసింది.ఇకపోతే రాబోయే రోజుల్లో కంటికి కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోనుంది ఈ సిమ్ కార్డు.నేటి దైనందిత జీవితంలో అప్డేటెడ్ సెల్ఫోన్లు, వాచ్లతో పాటే ‘ఈ-సిమ్’లూ విస్తృతంగా వినియోగంలోకి రానున్నాయి.

 Do You Know The Benefits Of E Sim For Your Smart Phones Details, E Sim, Special,-TeluguStop.com

Telugu Benefits, Smart, Latest, Ups-Technology Telugu

‘ఈ-సిమ్‌’ అనేది కొన్ని సంవత్సరాల క్రితమే మార్కెట్లోకి వచ్చినా.అంతగా ప్రాచుర్యం పొందలేదు.కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ఇపుడు ‘ఈ సిమ్’పై ఆసక్తి కనబరుస్తున్నారు.

మొబైల్ స్టోర్ కి వెళ్లకుండానే SMS, ఈ-మెయిల్ ద్వారా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండడం దీని ప్రత్యేకత.టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎంత జాగ్రత్తగా వున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

వాటిలో చాలా వరకు సిమ్ స్వాప్ మోసాలకు సంబంధించిన కేసులు కావడం గమనార్హం.

Telugu Benefits, Smart, Latest, Ups-Technology Telugu

ఇక ‘ఈ-సిమ్‌’ కార్డు వలన మోసాలకు తావుండదు.‘ఈ-సిమ్‌’ వాడుతున్నప్పుడు సిమ్ పోయిందని లేదా పాడైపోయిందని నెట్ వర్క్ ప్రొవైడరుకి ఫిర్యాదు చేయడానికి వీలుపడదు.ఒకవేళ ఎవరైనా అలా చేస్తే.

వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది.ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్-14 మోడల్స్ లో సిమ్ స్లాట్స్ లేవు.

ఇవి ‘ఈ-సిమ్‌’ ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి.వీటిని సులభంగా యాక్టివేట్ చేయడంతో పాటు డి-యాక్టివేట్ కూడా చేయవచ్చు.

ప్రపంచంలో మొట్టమొదట ‘ఈ-సిమ్‌’ ని 2016లో శామ్సంగ్ గేర్ ఎస్2 3జీ స్మార్ట్వచ్ కోసం అందుబాటులోకి తెచ్చారు.అనంతరం 2017లో యాపిల్ స్మార్ట్ వాచ్ కూడా దీన్ని ప్రవేశపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube