సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి ఎన్ని ఉపయోగాలో తెలుసా…?  

do you know the benefits of cycling for the body cycling, health tips, swinminng, cycle, immunity boositing, presser - Telugu Cycle, Cycling, Health Tips, Immunity Boositing, Presser, Swinminng

మనం చిన్నప్పుడు ఎంతో కష్టపడి సైకిల్ నేర్చుకొని దానిని తొక్కుతూ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం.ఇది అందరికీ గుర్తే ఉండి ఉంటుంది.

TeluguStop.com - Do You Know The Benefits Of Cycling For The Body

అయితే ఇప్పుడు ఆ సైకిల్ కొనడానికి స్తోమత ఉన్న దానిని తొక్కేందుకు సమయం లేకుండా పోయింది.అయితే సైక్లింగ్ కూడా ఓ మంచి వ్యాయామం అన్న విషయం అందరికి తెలిసిందే.

ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారికి సైక్లింగ్ విధానం ద్వారా అతి సులువుగా బరువు తగ్గించుకోవచ్చు.అయితే కొందరు ఇంట్లోనే సైక్లింగ్ లాంటి ప్రక్రియను ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే ఉండి వాడుతున్నారు కూడా.

TeluguStop.com - సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి ఎన్ని ఉపయోగాలో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే సైక్లింగ్ వల్ల మనకు ఎన్ని క్యాలరీలు తగ్గుతాయి…? ఎంత సమయం చేస్తే ఎంత తగ్గుతుంది…? అన్న వాటి విషయం గురించి చూస్తే….

ఇకపోతే మానవ శరీరంలో ఒక పౌండ్ బరువు తగ్గాలంటే ఏకంగా 3500 కేలరీల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అయితే మామూలుగా ఇతర ఎక్సర్సైజులు చేయడం ద్వారా క్యాలరీలు కరుగుతాయి.కాకపోతే కాస్త ఎక్కువ సమయం పడుతుంది.అదే సైక్లింగ్ చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలను తక్కువ సమయంలోనే కరిగించుకోవచ్చు.సైకిల్ ను కేవలం ఓ గంటసేపు తొక్కితే మన శరీరంలోని 400 కేలరీలను ఖర్చు చేయవచ్చు.

ఇలా వారానికి కనీసం 5 నుండి 7 గంటల వరకు సైకిల్ ను తొక్క గలిగితే ఓ వారం రోజుల్లో ఓ పౌండ్ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

ఇలా సైకిల్ తొక్కితే బరువు తగ్గాలనుకొనే వారికి మాత్రం ఓ చిన్న సూచన.

అది ఏమిటంటే… సైకిల్ తొక్కడానికి ఎక్కడపడితే అక్కడ కాకుండా సాఫీగా ఉన్న రోడ్డుపై తొక్కడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.అంతేకాకుండా సైకిల్ ను తొక్కే సమయంలో అందుకు సంబంధించి షూస్, అలాగే వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.

సైకిల్ తొక్కడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.ప్రతిరోజు ఈ సైక్లింగ్ చేయడం ద్వారా మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తద్వారా మనకు ఎలాంటి వ్యాధులు అంత సులువుగా దరిచేరవు.అలాగే మన శరీరంలోని కండరాలు బలోపేతం అవుతాయి కూడా.

సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు చేయడం ద్వారా గుండె నొప్పిని కలుగజేసే సమస్యలను కొద్దిమేర తగ్గించుకోవచ్చు.అంతేగాక ఈ సైకిల్ ప్రక్రియ ద్వారా మన మనస్సు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.

ఏదైనా పూర్తి ఒత్తిడి అనిపించినప్పుడు అలా ప్రశాంతంగా సైక్లింగ్ చేస్తే ఆ విషయాల నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.కాబట్టి ప్రతిరోజు వీలైతే సమయం కుదించుకుని సైక్లింగ్ చేయడానికి ప్రయత్నించండి.

#Presser #Cycling #Swinminng #Health Tips #Cycle

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Do You Know The Benefits Of Cycling For The Body Related Telugu News,Photos/Pics,Images..