బాహుబలి లో అనుష్కకి డూప్ గా నటించిన నటి ఎవరో తెలుసా..?

Do You Know The Actress Who Acted As A Dupe For Anushka In Baahubali..? , Anushka, Rushika Raj , Baahubali, Baahubali 2 . Prabhas, Tollywood , Rana , Rajamouli

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అనుష్క అనే చెప్పాలి.ఈమె చేసిన సినిమాలు దాదాపు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి…ఇక బాహుబలీ సిరీస్ గురించి చెప్పాలంటే ఈ సినిమా అనుష్క సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.

 Do You Know The Actress Who Acted As A Dupe For Anushka In Baahubali..? , Anush-TeluguStop.com

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రభాస్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కించారు.బాహుబలి( Baahubali ) తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని దేశమంతటా వ్యాపించే విధంగా చేసింది.

ఈ సినిమాతో ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు పాన్ ఇండియా వైపు చూస్తుండటం గమనార్హం.ప్రధానంగా సంచలనాలు సృష్టించి రికార్డులను తిరగరాసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోయింది…

Telugu Anushka, Baahubali, Rajamouli, Rana, Rushika Raj, Tollywood-Movie

రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన ఈ సినిమాలో తొలిభాగంలో అనుష్క( Anushka ) బానిసగా, రెండో భాగంలో యువరాణిగా తన నటనతో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పవచ్చు.ఇదిలా ఉంటే.ఈ మూవీలో అనుష్క పాత్రకు కొన్ని సన్నివేశాల్లో డూప్ ని పెట్టిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి.

ఎందుకు అంటే ఆమె అంతలా అనుష్క క్యారెక్టర్ లో ఒదిగిపోయి మరీ నటించింది.చూడటానికి అచ్చం అనుష్క మాదిరిగానే ఉంటుంది.కాబట్టి ఆమెను డూప్ అని ఎవ్వరూ అంత త్వరగా ఐడెంటిపై చేయలేరేమో అంతలా తన నటనతో పోలికలతో అదురగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ…

Telugu Anushka, Baahubali, Rajamouli, Rana, Rushika Raj, Tollywood-Movie

ఈమె కూడా ఓ హీరోయిన్.పేరు రుషిక రాజ్( Rushika Raj ) చూడటానికి అనుష్క మాదిరిగానే ఉంటుంది.దూరం నుంచి చూస్తే వీరిద్దరిలో అనుష్క ఎవరు అని గుర్తు పట్టడం చాలా కష్టం.

ఇకపోతే ఆమె అనుష్కకి డూప్ గానే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి అలరించింది.ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇక అనుష్క విషయానికొస్తే.బాహుబలి సినిమా తరువాత భారీగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు.

కానీ ఒకటి రెండు సినిమాలకే పరిమితమైంది.దాదాపు మూడు నాలుగు ఏళ్లకు పైగా మళ్లీ తన సినిమాను ప్రకటించలేదు ఈ ముద్దుగుమ్మ.

తాజాగా మిస్టర్ వర్సెస్ మిసెస్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో యంగ్ హీరో అయిన నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్నాడు….

ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు…ఈ సినిమా తో అనుష్క మంచి హిట్ కొడితే మళ్ళీ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో అనుష్క దూసుకు పోతుందనే చెప్పాలి…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube