Tollywood Movies : ఈ సినిమాల్లో నైట్ కి నైటే హీరోలను మార్చేసారనే విషయం మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మొదట కొన్ని సినిమాలకి కొంతమంది హీరోలను అనుకొని వాళ్లతో సినిమాలను స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్లు సెట్ అవ్వట్లేదని వారిని మార్చేసి మరొక హీరో తో సినిమాలు చేసిన సందర్భాలు పుష్కలంగా ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకే హీరోకు సంబంధించి రెండు సార్లు ఇలా జరగడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి.

 Do You Know That The Heroes Are Changed Night By Night In These Movies Rabhasa-TeluguStop.com

ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్( Ram Pothineni ) విషయంలో రెండు సార్లు ఇలాగే జరిగింది.అనిల్ రావిపూడి డైరెక్షన్ వచ్చిన రాజా ది గ్రేట్( Raja The Great ) సినిమాని మొదట స్టార్ట్ చేశాడు.

ఆ తర్వాత రామ్ ను తప్పించి ఈ సినిమాలోకి రవితేజను ఎంటర్ చేశారు.ఇక ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించడమే కాకుండా రవితేజ కి మంచి కంబ్యాక్ సినిమాగా ఉపయోగపడిందనే చెప్పాలి.

 Do You Know That The Heroes Are Changed Night By Night In These Movies Rabhasa-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా కందిరీగ( Kandireega ) అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో వీళ్ళ కాంబో లో మరొక సినిమాని కూడా రామ్ తోనే చేయాలని సంతోష్ శ్రీనివాస్( Santosh Srinivas ) ప్లాన్ చేసుకున్నాడు.దానికి సంబంధించి సినిమాని కూడా స్టార్ట్ చేసి కొన్ని సీన్లను కూడా షూట్ చేశారు.

కానీ ఆ తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ కి రామ్ కి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఈ సినిమా నుంచి రామ్ ను తప్పించి ఈ సినిమాలోకి జూనియర్ ఎన్టీఆర్ ని( Jr NTR ) తీసుకున్నారు.దాంతో రభస( Rabhasa ) పేరు తో ఈ సినిమాని రిలీజ్ చేశారు.ఈ సినిమా ఫ్లాప్ అయింది…ఇలా రామ్ కి సంభందించిన రెండు సినిమాల విషయం లో ఇలానే జరగడం అప్పట్లో ఆయన ఫ్యాన్స్ ను కొంతవరకు కలిచి వేసిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube