ముషారఫ్, హెయిర్ స్టైల్ గురించి ధోనికి సలహా ఇచ్చిన సంగతి మీకు తెలుసా?

ముషారఫ్, హెయిర్ స్టైల్ గురించి ధోనికి సలహా ఇవ్వడం ఏమిటి? ఎప్పుడు జరిగిందని అనుకుంటున్నారా? అయితే ఈ కధనం పూర్తిగా చదవండి.పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ దుబాయ్‌లో కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Do You Know That Musharraf Advised Dhoni About Hair Style Musharaf, Dhoni, Hair-TeluguStop.com

ఈ నేపథ్యంలో ముషారఫ్‌కు సంబంధించిన అనేక విషయాలు ఇపుడు సోషల్ మీడియా వేదికగా వెలుగు చూస్తున్నాయి.అవును, తాజాగా భారత మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ ఎమ్మెస్ ధోనికి ముషారఫ్ సలహా ఇచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఆ సమయంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ గురించే మాట్లాడుకునేవారు.ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా అప్పట్లో బాగా నచ్చింది.దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు.

ఈ ఘటన 2004లో జరగగా తాజాగా దీనికి సంబంధించినటువంటి వీడియో తెగ చక్కెర్లు కొడుతోంది.అప్పట్లో టీమిండియా ఒక టోర్నీ కోసం పాకిస్తాన్‌లో పర్యటించగా, అక్కడ లాహార్ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ హాజరయ్యారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిందనే విషయం అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది.ఈ సందర్భంగా ముషారఫ్ చేతుల మీదుగా ధోనికి బహుమతి అందించారు.

ఆ సమయంలో ముషారఫ్ మాట్లాడుతూ… “మ్యాచ్ గెలిచినందుకు ధోనికి నా హృదయపూర్వక అభినందనలు.మీరు హెయిర్ కట్ చేయించుకోవాలంటూ మ్యాచ్ సందర్భంగా ఎవరో ప్లకార్డు పట్టుకోవడం చూశాను.

ఒకవేళ నా మాట వింటానంటే ఒక సలహా ఇస్తా వారికి.ఈ హెయిర్ కట్‌తో నువ్వు చాలా బాగున్నావు.

నీ హెయిర్ స్టైల్ అలాగే ఉంచు.హెయిర్ కట్ చేయించుకోవద్దు!” అని సలహా ఇవ్వగా దాంతో ధోని ఇదంతా నవ్వుతూ విని ముషారఫ్ చేతుల మీదుగా తన షీల్డ్ తీసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube