ఆ బాలీవుడ్ నటి గూగుల్ లో టాప్ ఉద్యోగి.. పరిశ్రమ దారుణ అవమానాలే కారణం?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోవడం పొరపాటే అని చెప్పాలి.ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్న నటులు ఆ ఇండస్ట్రీ కాదనకపోవడంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.

 Do You Know That Mayuri Congo Bollywood Actress Is A Top Employee In Google-TeluguStop.com

అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంతకాలానికే ఇండస్ట్రీని వదిలే పరిస్థితులు వచ్చాయి.అంతేకాకుండా స్టార్ హోదా సంపాదించుకున్న కూడా ఆ హోదా ఉన్నప్పటికీ కూడా అవకాశాలు మాత్రం చేతికి రావు.

అలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా నటీ నటుల పరిస్థితి ఇంతే అని చెప్పాలి.ఇక హీరోయిన్స్ మాత్రం తాము పెళ్లిళ్లు చేసుకుంటే చాలు ఇక ఆ హీరోయిన్ కు ఛాన్సులు రావడం అనేది గ్యారెంటీగా చెప్పలేం.

 Do You Know That Mayuri Congo Bollywood Actress Is A Top Employee In Google-ఆ బాలీవుడ్ నటి గూగుల్ లో టాప్ ఉద్యోగి.. పరిశ్రమ దారుణ అవమానాలే కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అటువంటి ఇండస్ట్రీని నమ్ముకున్న ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక మరికొందరు వ్యాపారంలో, ఉద్యోగాలలో అడుగులు పెట్టారు.

నిజానికి మొన్నటి వరకు నటులంతా ఇండస్ట్రీ నమ్ముకొని ఉండగా ఎటువంటి వ్యాపారాలను కూడా ప్రారంభించలేదు.కానీ ఇప్పుడున్న నటీనటులు సినీ ఇండస్ట్రీ గురించి ముందే తెలుసుకొని.

నటులుగా కొనసాగుతున్న సమయంలోనే వ్యాపారాలలో అడుగులు పెడుతున్నారు.ఇక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మయూరి కాంగో.నసీం అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Telugu About Actress Mayuri Congo, Actress, Actress Mayuri Congo, Bollywood, Completed Iit, Employee, Google, Google India, Top Employee-Movie

ఈ సినిమా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది.పాపా కాహ్తే హై అనే సినిమాలో ఘర్ సే నికళ్తే హై అనే పాట తో మాత్రం మరింత గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో స్టార్ నటుల సరసన నటించింది.ఇక ఈ బ్యూటీ ఐఐటి చదువును కూడా పూర్తి చేయగా నటనపై ఆసక్తి ఉండటంతో చదువుని వదిలేసింది.

Telugu About Actress Mayuri Congo, Actress, Actress Mayuri Congo, Bollywood, Completed Iit, Employee, Google, Google India, Top Employee-Movie

ఇక వెండితెరపై మెల్ల మెల్లగా కొన్ని అవమానాలు ఎదుర్కొంది.అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.ఆ సమయంలో బుల్లితెరపై అడుగు పెట్టింది.అక్కడ కూడా అవకాశాలు అంతగా లేకపోగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఆ తర్వాత తన చదువును కొనసాగించింది.ఇక న్యూయార్క్ డిజిటల్ ఏజెన్సీ 360ఐ లో కొన్ని రోజులు ఉద్యోగం చేసింది.ఆ తర్వాత డిజిటాస్, జెనిత్ చీప్ డిజిటల్ ఆఫీసర్ గా కూడా ​చేసింది.

ఆ తర్వాత ఇండియాకు షిఫ్ట్ అవ్వగా గుర్ గావ్ లో సెటిల్ అయింది.

Telugu About Actress Mayuri Congo, Actress, Actress Mayuri Congo, Bollywood, Completed Iit, Employee, Google, Google India, Top Employee-Movie

ఇక గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టగా తన ఉద్యోగంలో భాగంగా ముంబైలో, బెంగళూర్ నగరాలలో బాగా బిజీగా ఉందని తెలిసింది.ఇక ఈమె ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోగా ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.ఇక ఈమె మరోసారి ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది.

ఒకవేళ తనకు నచ్చిన స్క్రిప్టులు వస్తే మాత్రం అప్పుడు చూస్తాను అంటూ గతంలో తెలిపింది.

#ActressMayuri #Employee #Actress #Iit #ActressMayuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు