Hero Nikhil Chadarangam Serial: హీరో నిఖిల్ బుల్లితెర సీరియల్స్ లో నటించారని తెలుసా?

హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి పరిచయం అవసరం లేదు.మొదటి సినిమా ద్వారానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ అనంతరం పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

 Do You Know That Hero Nikhil Siddharth Acted In Chadarangam Serial Details,   He-TeluguStop.com

ఇకపోతే నిఖిల్ తాజాగా నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్ మొదటిసారి హ్యాపీడేస్ సినిమాలో నటించారని చాలామంది భావిస్తారు.

ఇకపోతే ఈయన సినిమాలలో కన్నా ముందుగా సీరియల్స్ లో నటించారనే విషయం చాలా మందికి తెలియదు.ఈయన మొదటిసారిగా బుల్లితెర సీరియల్స్ లో విలన్ పాత్రలో నటించారు.మరి నిఖిల్ నటించిన సీరియల్ ఏంటి అనే విషయానికి వస్తే…

Telugu Chadarangam, Nikhil, Karthikeya, Nikhilsiddharth, Serials, Tollywood-Movi

ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్న చదరంగం అనే సీరియల్లో మొదటిసారిగా నటించారు.ఇక ఈ సీరియల్ లో రాజీవ్ కనకాలతో పాటు తనికెళ్ల భరణి కూడా నటించారు.ఇలా ఈ సీరియల్లో ఈయన సుమారు 40 ఎపిసోడ్ల వరకు విలన్ పాత్రలో నటించారు.ఈయన ఈ సీరియల్ లో నటిస్తున్న సమయంలో నిఖిల్ ఇంటర్మీడియట్ చదవడం విశేషం.

ఇలా బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఈయన హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube