అందం అభినయంతో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్న నటి ముచ్చర్ల అరుణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె1981లో భారతీయ రాజా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీతాకోక చిలుక చిత్రం ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి పోయింది.ఈ చిత్రం ద్వారా విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన అరుణ ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలోకి దూసుకు పోయారు.ఈమె 10 సంవత్సరాల సినీ కెరీర్లో ఏకంగా 70 చిత్రాలలో నటించారు అంటే ఈమెకు ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ అర్థమవుతుంది.
అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అరుణ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.ఈ విధంగా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా.
మోహన్‌గుప్త అనే ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.ప్రస్తుతం నలుగురు పిల్లలతో అమెరికాలో నివాస ముంటున్న అరుణ చాలా సంవత్సరాల తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈమె ఎన్నో ఆరోగ్య విషయాలను ఆహార పదార్థాల గురించి తెలియజేస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన అరుణ చాలా సంవత్సరాల తర్వాత ఇలా కనిపించే సరికి ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగి పోయింది.ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన అతి తక్కువ సమయంలోనే లక్షకుపైగా ఫాలోవర్స్ రావడం విశేషం.ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ నటి తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది భావిస్తున్నారు.
మరి అభిమానుల కోరికను హీరోయిన్ తీరుస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.