ఆహాకు సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో సమంత అక్కినేని ఒకరు.తెలుగు, తమిళం వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను సంపాదించుకున్న సమంత, అక్కినేని కోడలు గా వచ్చిన తర్వాత కూడా తన కెరీర్ కి పులిస్టాప్ పెట్టకుండా తనదైన శైలిలో వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది.

 Samantha Akkineni,aha ,sam Jam Show,remuneration,tollywood, Akkineni Nagarjuna,-TeluguStop.com

టిటి ప్లాట్ ఫామ్ వేదికగా అల్లు అరవింద్ స్థాపించిన “ఆహా”యాప్ ద్వారా “సామ్ జామ్”అనే టాక్ షో కు వ్యాఖ్యాతగా సమంత బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే.

సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఆహా అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా ఉండటంతో ఆ షో పైఅభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.

అంతేకాకుండా ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ టాక్ షో నిర్వహిస్తున్నారంటే అందుకు రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో ఇచ్చే ఉంటారని అంతా అనుకున్నారు.కానీ ఈ టాక్ షోకు హోస్ట్ గా నిర్వహించినందుకు సమంత ఇప్పటి వరకు ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోలేదని, కేవలం ఈ ఈ షో షోకు మాత్రమే అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.

Telugu Sam Jam Show, Tollywood-Movie

సమంత ఈ టాక్ షో కోసం కేవలం కోటిన్నర మాత్రమే తీసుకున్నారు.అది కూడా 10 ఎపిసోడ్ లకు కలిపి తీసుకున్న రెమ్యూనరేషన్.ఈ ప్రకారం ప్రతి ఎపిసోడ్ కి సమంత కేవలం 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు.అంత స్టార్ హీరోయిన్ అయిన సమంత కేవలం కోటిన్నర ఈ టాక్ షో నిర్వహించడం ఏమిటని టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

అందుకు గల కారణం కేవలం అల్లు అరవింద్, నాగార్జున మధ్య మంచి అనుబంధం ఉండటం వల్ల అల్లు అరవింద్ అడిగిన వెంటనే సమంత మరో మాట మాట్లాడకుండా ఒప్పుకుంది.అయితే ఇప్పటికే ఈ టాక్ షో ఒక ఎపిసోడ్ ప్రసారం అయింది.

అయితే ఆశించిన స్థాయిలో ఈ షో అందరిని ఆకట్టుకోలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube