కౌరవుల జననం వెనుక జరిగిన కథ ఏమిటో తెలుసా?

Do You Know Reason Behind The Kouravas Birth, Kouravas , Ghandari , Drutarastrudu, Devotional , Vyasamaharshi

ధృతరాష్ట్రుడి భార్య గాంధారి అని మనందరికీ తెలిసిందే. అయితే ఆమెకు వంద మంది సంతానం ఎలా కల్గింది… అసలు ఆమెకు నూర్గురు సంతానం కల్గాలని ఎవరు వరం ఇచ్చారో చాలా మందికి తెలియదు.

 Do You Know Reason Behind The Kouravas Birth, Kouravas , Ghandari , Drutarastru-TeluguStop.com

 అయితే మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.గాంధారి ధృతరాష్ట్రుడి వల్ల గర్భం దాలుస్తుంది.

 కానీ నెలలు గడిచిపోతున్నా ఆమెకు ఇంకా పిల్లలు పుట్టారు. తనతో పాటు గర్భం దాల్చిన పాండురాజు భార్య కుంతీ దేవికి మాత్రం ఇద్దరు పిల్లలు పుడతారు.

 అయితే తనకే ఎందుకిలా అవుతుందని భావించన గాంధారి కుంతీ దేవి మీద అసూయతో… తన కడుపుపై కొట్టుకుంటుంది. ఆలా చేయడంతో… కడుపులో పూర్తిగా బిడ్డగా మారకుండా ఉన్న మాంసపు ముద్ద బయటపడుతుంది.

 అది చూసి తీవ్రంగా భయపడిపోయిన గాంధారి వేద వ్యాసుడి వద్దకు వెళ్లి విషయం గురించి చెప్తుంది. అయితే గతంలోనే వ్యాస మహర్షి గాంధారికి నీకు వంద మంది పిల్లలు కల్గాలని వరం స్తాడు.

 అందు కోసం. పూర్తిగా ఎదగకుండానే బయట పడ్డ ఆ మాంసపు ముద్దను వంద భాగాలు చేస్తాడు.

 వాటిని నేతి కుండల్లో వేసి భద్రపరుస్తాడు. అలా ఒఖ సంవత్సర కాలం పాటు నేతిలో ఉంచుతారు.

 అప్పుడు కౌరవుల్లో పెద్ద వాడైన దుర్యోధనుడు అందరి కంటే ముందుగా నేతి కుడంను చీల్చుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత దుశ్శాసనుడు బయటకు వస్తాడు.

 ఇలా వంద మంది ఒకరి తర్వాత మరొకరు బయటకు వస్తారు. వారే గాంధారి పుత్రులైన కౌరవులు.

Video : Do You Know Reason Behind The Kouravas Birth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube