టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి మనందరికి తెలిసిందే.చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చెర్రీ.అయితే మాములుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన వాటిని మరో హీరో,హీరోయిన్ లు చేయడం ఆ సినిమాలు హిట్ అవ్వడం ఇవన్నీ కామన్.
ఇలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించాయి.ఇకపోతే హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారట.
మరి రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏవి? ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను సాధించాయి అన్న వివరాల్లోకి వెళితే.
చెర్రీ తన కెరీర్ లో ఇప్పటివరకు ఐదు సినిమాల్లో చేశారు.అందులో ఆర్‌ఆర్‌ఆర్ వంటి మంచి హిట్ మూవీ తర్వాత మాస్ అప్పీల్ ఉన్న కథ కోసం చరణ్ ( Ram Charan )కోరుకున్నారట.దీంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌కు ఓకే చేయలేదని వార్తలు వచ్చాయి.
తరువాత అదే కథను విజయ్ దేవరకొండకు ఆయన వివరించాడట.అది ఇప్పుడు VD12గా రూపొందనుందని సమాచారం.
ఇకపోతే వారణం ఆయురం సినిమాలో కోలీవుడ్ హీరో సూర్య నటించిన విషయం తెలిసిందే.తెలుగులో సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్ ( Surya Son of Krishnan )పేరుతో 2008లో ఈ మూవీ విడుదలైంది.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.తమిళ్ వర్షన్ కంటే టాలీవుడ్ లోనే ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు అయింది.
రీసెంట్ గా తెలుగులో రీ-రిలీజ్ చేసినా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.ఈ సినిమాను చూస్తున్నంత సేపు సూర్య తప్ప మరే ఇతర నటుడు గుర్తుకు రారని చెప్పవచ్చు.ఈ సినిమా ఆఫర్ మొదట చరణ్‌కు వచ్చింది.
ఆ సమయంలో SS రాజమౌళితో మగధీర షూటింగ్ షెడ్యూల్ బిజీలో చరణ్ ఉన్న చెర్రీ ఈ మూవీ ని రిజెక్ట్ చేశారు.మలయాళం మూవీ అయినా ఓకే కన్మణి సినిమా 2014లో విడుదల అయ్యి మంచి హిట్ సాధించింది.
హిందీలో ఓకే జాను సినిమాతో రీమేక్ కాగా టాలీవుడ్ లో ఓకే బంగారం పేరుతో విడుదల అయింది.ఈ కథలో హీరో పాత్రకు రామ్ చరణ్ కరెక్ట్‌గా సెట్ అవుతాడని దర్శకుడు మణిరత్నం భావించారట.
మొదట ఈ కథను చరణ్‌కే ఆయన చెప్పారట.ఆ సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పారు చెర్రీ.
రామ్ చరణ్ ఇటీవల తిరస్కరించిన చిత్రాలలో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీకూడా ఒకటి.అఖిల్‌కు ఈ సినిమా భారీ డిజాస్టర్‌ను మిగిల్చింది.
ఈ చిత్రం మొదట రామ్ చరణ్ వద్దకు వెల్లగా ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటికే చరణ్‌తో ధృవ సినిమా తీసి ఉన్నాడు.దీంతో రెండో సినిమా ప్లాన్ చేయాలని ఈ కథతో చరణ్‌ను సురేందర్ రెడ్డి కలిశారట.
కానీ పలు కారణాల వల్ల చరణ్ నో చెప్పారట.
ఈ సినిమా విడుదల ఈ ఘోరమైన డిజాస్టర్లు చవిచూసిన విషయం తెలిసిందే.అలాగే 2008లో సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్ తిరష్కరించిన చరణ్‌తో ఎలాగైన ఒక సినిమా తీయాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనుకున్నారట.సుమారు నాలుగేళ్లు నిరీక్షించి 2012లో చరణ్ ను ఆయన కలిశారట.
ఆ సమయంలో ఏటో వెళ్లిపోయింది మనసు( Yeto Vellipoyindhi Manasu ) కథను వినిపించారట.రొమాంటిక్ కామెడీగా ఉన్న కథ కావడంతో చరణ్ నో చెప్పారట.
దాంతో అది కాస్త నాని వద్దకు ఆ ప్రాజెక్ట్ చేరిపోయింది.ఇందులో సమంత హీరోయిన్‌గా కనిపించింది.
ఈ చిత్రం విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నప్పటికీ, అది వాణిజ్య పరంగా రాణించలేదు.