పట్టణాల్లో కంటే గ్రామాల్లో మంచి ఆరోగ్యకర జీవితం... ఇదే మీ అభిప్రాయం అయితే ఇది ఒకసారి చదవండి

పల్లెటూరుల్లో స్వచ్చమైన గాలి, పచ్చదనంతో అహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, అందుకే పట్టణం కంటే పల్లెటూరుల్లో జీవితం చాలా బాగుంటుందని, పల్లెల్లో ఉండే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని మనం ఇప్పటి వరకు అనుకూంటూ వచ్చాం.సినిమాల్లో, టీవీల్లో కూడా పల్లెల్లో ఉండే వారు సంతోషంగా, వారే ఆరోగ్యంగా ఉంటారని చూపించారు.

 Do You Know Pollution In Villages More Than Towns And Citys-TeluguStop.com

కాని అసలు విషయంను ఒక ప్రముఖ సంస్థ సర్వే చేసి వెళ్లడించింది.ఆ సంస్థ చేసిన సర్వేలో నివ్వెర పోయే నిజాలు బయటకు వచ్చాయి.

అసలు ఇలాంటి సర్వే ఫలితాలను జనాలు జీర్ణించుకోలేక పోతున్నారు.ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చిన విషయం నిజం కాదని అంతా షాక్‌ అవుతున్నారు.

పట్టణాల్లో కంటే గ్రామాల్లో మంచి వాతావరణం ఉంటుంది, దాని వల్ల ఆరోగ్యంగా జీవితం ఉంటుందని అనుకునే వారికి సర్వే చెప్పిన విషయాలు మింగుడు పడకపోవచ్చు.కాని ఇదే నిజం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆకు పచ్చగా ఉన్నంత మాత్రాన పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం ఉందనుకుంటే పొరపాటే అంటూ వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రపంచంలోని దాదాపు వంద ప్రాంతాల్లో అనేక సర్వేలు చేసిన శాస్త్రవేత్తలు పల్లెల్లో కంటే పట్టణాల్లోనే జనాలు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకున్నారు.పల్లెల్లో కొన్ని మంచి పరిస్థితులు ఉన్నా కూడా పట్టణాల్లో కంటే ఎక్కువగా పల్లెల్లోనే కలుషిత వాతావరణం ఉంటుందని, పల్లెల్లోనే అంటు వాద్యులు ఎక్కువగా ప్రభలుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కాలుష్యం కారణంగా పల్లెల్లో ఎక్కువ జనాలు చనిపోతున్నారా, పట్టణాల్లో ఎక్కువగా చనిపోతున్నారా అంటే ప్రతి ఒక్కరు ఠక్కున పట్టణాల్లో అంటారు.కాని అసలు విషయం ఏంటీ అంటే పల్లెల్లోనే ఎక్కువగా జనాలు కలుషిత వాతావరణం, కలుషిత నీరు కారణంగా చనిపోతున్నారు.

ఈ విషయాన్ని సదరు సంస్థ చాలా పరిశోదనలు చేసిన తర్వాత వెళ్లడించింది.పల్లెల్లో కనీసం నాలెడ్జ్‌ లేని కారణంగా వాతావరణంను ఎక్కువగా కాలుష్యం చేస్తున్నారట.ఇక నీరు విషయంలో కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తాగుతున్న కారణంగా పల్లెల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.

పల్లెటూరు జనాల జీవన శైలి కారణంగా ఎక్కువగా కాలుష్యం అవుతుందని అంటున్నారు.

పట్టణాల్లో ప్లాస్టిక్‌ వల్ల కాలుష్యం అయితే పల్లెటూరుల్లో అనేక రకాలుగా కాలుష్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా వ్యవసాయం చేసే గ్రామాల్లో నీరు మరియు గాలి ఫెర్టిలైజర్స్‌ మరియు ఫెర్టిసైడ్స్‌ వల్ల కాలుష్యం అవుతుందని అంటున్నారు.

అందుకే ఇకపై పిల్లలకు అయినా మరెవ్వరికైనా పల్లెల్లో మంచి ఆరోగ్యకర జీవితం ఉంటుందని చెప్పకండి, ఎందుకంటే అది నిజం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube