బాలయ్య బాబుని ఫాలో అవుతున్న పవన్  ఎందులోనో తెలుసా...?  

Do You Know Pawan Kalyan Is Following Balakrishna-layar Saab News,pawan Kalyan,pawan Kalyan Latest Movie News,pawan Kalyan Layar Saab,pawan Kalyan News,sriram Venu

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయాలనే నెపంతో రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉండి మళ్లీ ఇప్పుడు పింక్ అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించినటువంటి పింక్ చిత్రానికి రీమేక్.

Do You Know Pawan Kalyan Is Following Balakrishna-Layar Saab News Pawan Latest Movie Layar Sriram Venu

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.

అంతేకాక ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది.తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న అటువంటి మరో చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అంతేకాక ఈ చిత్రంలో ఇప్పటికే వరుణ్ తేజ్ నటించినటువంటి కంచె సినిమాలో వరుణ్ సరసన ఆడిపాడిన  ప్రగ్యజైస్వాల్ ని పవన్ కు జోడిగా నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే పవన్ కళ్యాణ్ గతంలో నటించినటువంటి పలు చిత్రాల్లో కూడా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న అను ఇమ్మానియేల్, కృతి కర్బందా, నిఖిషా పటేల్ వంటి వారికి అవకాశం ఇచ్చారు.

అయితే ఇది ఇలా ఉండగా  తెలుగు సినీ పరిశ్రమలో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే బాలయ్య బాబు కూడా ఇదే కోవకే చెందుతారు.ఎందుకంటే బాలయ్య బాబు కూడా తన సినిమాలో హీరోయిన్ గురించి పెద్దగా పట్టించుకోడు.తన పాత్రకి తగినటువంటి న్యాయం చేసే వారు ఎవరైనా సరే ఓకే చెప్పేస్తాడు.

అందువల్ల పలు సినీ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఎప్పుడు స్టార్ హీరోయిన్లకు అవకాశాలు ఇస్తే మిగిలిన వారికి  అవకాశాలు దూరమవుతాయని అంతేగాక ప్రతిభ ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశం రాక నిరూపించుకోలేక ఇబ్బందులు పడతారని అంటున్నారు.

ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ రెండు చిత్రాల దర్శకులకు అనుకున్న సమయంలోనే చిత్రీకరణ పూర్తి చేయాలని అంతేకాక మరింత ఎక్కువ సమయం కేటాయించాలంటే కుదరదని ఎందుకంటే ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని తెగేసి చెప్పాడట.

దీంతో దర్శక నిర్మాతలు చిత్రీకరణ పనులు వేగవంతం చేశారు.అయితే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

  అంతేగాక ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు పెంచుకొంటున్నారు.

తాజా వార్తలు

Do You Know Pawan Kalyan Is Following Balakrishna-layar Saab News,pawan Kalyan,pawan Kalyan Latest Movie News,pawan Kalyan Layar Saab,pawan Kalyan News,sriram Venu Related....