కాకాసురుడు ఎవరు? ఆయన కథ ఏమిటో తెలుసా?

కాకాసుర వృత్తాంతం రామాయణం లోని సుందర కాండలో వివరించ బడింది.హనుమంతుడు అశోక వనంలో సీతను దర్శించి  , సీత క్షేమంగా ఉందన్న వార్తను శ్రీరామునికి తెలియ జేయడానికి తిరిగి వెళ్లే ముందు తాను ఆమెను చూసి వచ్చి నందుకు గుర్తుగా ఏదైనా శ్రేష్టమైన అభిజ్ఞానం చెప్పేమని సీతా దేవిని అడిగాడు.

 Do You Know Kakasura Story Details, Kakasurudu, Ramudu, Sita Devi, Crow, Ramayan-TeluguStop.com

అప్పుడామే  పూర్వం చిత్రకూటంలో జరిగిన కాకాసుర వృత్తాంతం రామునికి చెప్ప వలసిందిగా హనుమంతునికి చెబుతుంది.చిత్ర కూటంలో నివసించే టప్పుడు మందాకినీ తీరంలో సీత రాముని అంకంలో కూర్చుని ఉండగా… మాంసంపై ఆసక్తిగల తీరంలో ఒక కాకి వచ్చి ఆమెను స్తమ మధ్యంలో పొడుస్తుంది.

ఆమె మట్టి పెళ్ల విసిరి దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తుంది.అయినా ఆ కాకి ఆమెను పొడవలం మానలేదు.

రాముడది చూసి ఆమెను కాస్త పరి హసిస్తాడు.మళ్లీ కాకి రక్తం స్రవించేటట్టు ఆ దేవిని పొడుస్తుంది.

ఆ విషయాన్ని గమనించిన రాముడు కోపించి ఒక దర్భ పోచను తీసుకొని బ్రహ్మాస్త్రంతో దానిని సంయోజనం చేసి కాకిపై ప్రయోగిస్తాడు.అందుకు భయపడి కాకి పలు దిశలకు ఎగిరిపోతుంది.

కాని దర్భపోచ దాన్ని వదలకుండా వెన్నంటుతుంది.ముల్లోకాలూ తిరిగి ఎక్కడా రక్షణా పొందలేక మరల వచ్చి వాయ సంతుదకు రాముడే శరణు వేడుతుంది.

అప్పుడు రాముడు దానిపై దయ తలచి దాని ప్రాణాలు తీయ కుండా కుడి కన్నును మాత్రం హరిస్తాడు.కాకి రామునికి నమస్కరించి తన ఆవాసానికి వెళ్లిపోతుంది.

ఇదీ కాకాసుర వృత్తాంతం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube