హుజూర్‌ నగర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితం ఏంటో తెలుసా?  

Do You Know Huzurnagar Exit Polls Results-huzurnagar,today Run In Huzurnagar Elections,trs Shanampudi Saidhi Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తి రేకెత్తించిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలు నేడు జరిగాయి.రాష్ట్ర ముఖ్య నాయకులు అంతా కూడా హుజూర్‌ నగర్‌లో తిష్ట వేసి మరీ ప్రచారం చేశారు.

Do You Know Huzurnagar Exit Polls Results-huzurnagar,today Run In Huzurnagar Elections,trs Shanampudi Saidhi Reddy-Do You Know Huzurnagar Exit Polls Results-Huzurnagar Today Run In Elections Trs Shanampudi Saidhi Reddy

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడి భార్య పోటీలో ఉండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు జరిగాయి.ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసింది.

Do You Know Huzurnagar Exit Polls Results-huzurnagar,today Run In Huzurnagar Elections,trs Shanampudi Saidhi Reddy-Do You Know Huzurnagar Exit Polls Results-Huzurnagar Today Run In Elections Trs Shanampudi Saidhi Reddy

కేటీఆర్‌ తో పాటు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ప్రచారంలో పాల్గొన్నారు.కేసీఆర్‌ కూడా రావాల్సి ఉన్నా కూడా వర్షం కారణంగా ఆగిపోయారు.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చాయి.ముఖ్యంగా ఆరా మీడియా సంస్థ ప్రకటించిన సర్వే ఫలితం ప్రకారం టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎక్కువగా టీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.అయితే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం అవన్నీ పెయిడ్‌ సర్వేలు అని తాము వాటిని నమ్మబోమని, ఖచ్చితంగా కాంగ్రెస్‌ ఘన విజయం సాధించి టీఆర్‌ఎస్‌కు గట్టి బుద్ది చెప్పబోతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే మరో నాలుగు రోజులు వెయిట్‌ చేయాల్సిందే.