స్మార్ ఫోన్ లు వచ్చినప్పటి నుండి పనులు చాలా ఈజీ అయిపోతున్నాయి.చిటికేలో అన్ని మన దగ్గరికే వచ్చి చేరుతున్నాయి.
నచ్చిన ఫుడ్ తో సహా.ఇది నిజమే కదా.? మన నోటికి రుచికరమైనది ఏదైనా తినాలి అనిపిస్తే చాలు ఫోన్ తీసాం.నచ్చింది ఆర్డర్ చేస్తాం చేసి ఎంచక్కా తినేస్తాం.
అయితే ఇలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోడానికి ఉపయోగించే యాప్ లలో జొమాటో భలే క్లిక్ అయ్యింది.జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం జనాలకు అలవాటైపోయింది.
అంతలా ఈ బిజినెస్ క్లిక్ అయ్యింది.ఇప్పుడు జొమాటో ఫుడ్ ఆర్డర్ యాప్ లలో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకొని లక్ష కోట్ల టర్నోవర్ కు చేరుకుంది.
అసలు జొమాటో ఎలా మొదలైంది.? ఎవరు మొదలు పెట్టారు.ఇది మొదలు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం.
జొమాటోను గోయల్ అనే వ్యక్తి పంకజ్ చద్దాతో కలిసి స్టార్ట్ చేశాడు.
గోయల్ ఐఐటీ చదువుతున్న సమయంలో పిజ్జాను చాలా ఇష్టంగా తినేవాడట.తనకు నచ్చిన పిజ్జా కోసం తెగ ఆర్డర్ లు పెట్టుకునేవాడట.
కానీ ఏ పిజ్జా సంస్థకు ఆర్డర్ చేసినా తనకు నచ్చినది రాకపోవడం.ఆలస్యంగా రావడం ఇలా జరిగేవట.
దీంతో గోయల్ తెగ అసంతృప్తిగా ఉండేవాడట.ఆ తర్వాత గోయల్ ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
కానీ ఆఫీస్ క్యాంటీన్ మెనూలో చాలా తక్కువ ఐటమ్స్ ఉండడంతో తరచుగా బయటకు వెళ్లి తినిరావాలని అనిపించేదట.

నచ్చిన పిజ్జా దొరకక్కపోవడం.ఆలస్యంగా రావడం అలా ఆ రెండు అసంతృప్తిలతో దీనికి పరిష్కారం కోసం ఆలోచన చేస్తుండగా.పంకజ్ చద్దాతో గోయక్ కు పరిచయమైంది.
ఇక తనుకున్న ఫ్లాన్ ను గోయల్ పంకజ్ తో షేర్ చేసుకొని అలా ఇద్దరూ కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు.మొదట కేఫ్స్, రెస్టారెంట్స్ మెనూలతో ఫుడీబే అనే పేరుతో వీకెండ్ వెంచర్ ను మొదలు పెట్టారు.
ఆ తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి కేవలం రెండేళ్లలో జొమాటోగా మారిపోయింది.