చంటి పిల్ల‌ల్లో అజీర్తిని స‌హ‌జంగానే ఎలా నివారించాలో తెలుసా?

చంటి పిల్ల‌ల్లో ప్ర‌ధానంగా క‌నిపించే స‌మ‌స్య‌ల్లో అజీర్తి ఒక‌టి.వారి జీర్ణ వ్య‌వ‌స్థ చాలా సున్నితంగా ఉంటుంది.

 Children, Indigestion, Baby, Latest News, Health Tips, Good Health, Health, Dig-TeluguStop.com

అందు వ‌ల్ల‌నే చంటి పిల్ల‌ల్లో త‌ర‌చూ అజీర్తికి గురై తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే త‌ల్లుల్లు కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే గ‌నుక స‌హ‌జంగానే పిల్ల‌ల్లో అజీర్తి స‌మ‌స్య‌ను నివారించ‌వ‌చ్చు.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Telugu Baby, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్

అజీర్తిని నివారించ‌డంలో చామంతి టీ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.ఏంటీ టీ నా.? అని సంకోచించ‌కండి.చామంతి టీ స‌హ‌జ సిద్ధ‌మైన‌ది.దీన్నిఎలాంటి పిల్లలకైనా నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.పైగా ఈ టీని త‌యారు చేసుకోవ‌డం చాలా సులువు.ఒక క‌ప్పు మ‌రిగించిన నీటిలో కొన్ని ఎండ బెట్టిన చామంతి పూలు లేదా పూల పుడి వేసి ప‌ది నిమిషాల అనంత‌రం ఫిల్ట‌ర్ చేసుకుంటే టీ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ టీని చంటి పిల్ల‌ల‌కు ప‌ట్టిస్తే.అజీర్తి త‌గ్గుతుంది.

అయితే గుర్తించుకోవాల్సిన విష‌యం ఏంటంటే.కేవ‌లం ఒకే ఒక్క‌ స్పూన్ మాత్ర‌మే చంటి పిల్ల‌ల‌కు ఇవ్వాలి.

అలాగే చంటి పిల్ల‌ల్లో అజీర్తి ఉండ‌కూడ‌దు అంటే త‌ల్లి పాలు ఎంతో అవ‌స‌రం.క‌నీసం ఆరు నెల‌ల పాటు పిల్ల‌ల‌కు త‌ల్లి పాలు ప‌ట్టిస్తే అజీర్తి స‌మ‌స్యే దరి చేర‌దు.

పైగా త‌ల్లి పాల‌ల్లో ఉండే పోష‌కాల వ‌ల్ల పిల్ల‌ల్లో జీర్ణ వ్య‌వ‌స్థ‌, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ రెండూ బ‌ల‌ప‌డ‌తాయి.

చాలా మంది త‌ల్లులు చేసే పొర‌పాటు ఏంటంటే.

ఐదారు నెల‌లు వ‌చ్చిన‌ప్పటి నుంచీ పిల్ల‌ల‌కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ‌ ఫుడ్‌ను పెడ‌తారు.దాంతో వారు డైజెస్ట్ చేసుకోలేక అజీర్తికి గుర‌వుతారు.

అందుకే పిల్లలకు తగినంత ఆహారంమే ఇవ్వాలి.

మ‌సాజ్‌.

చంటి పిల్ల‌ల‌కు ఎంతో అవ‌స‌రం.రోజూ బేబీ ఆయిల్‌తో బాడీ మ‌సాజ్ చేస్తే ఎముకలు, కండరాల‌తో పాటుగా జీర్ణ‌క్రియ సైతం బలోపేతం అవుతుంది.

త‌ద్వారా అజీర్తే కాకుండా ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లూ ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Telugu Baby, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్

ఇక చంటి పిల్ల‌ల్లో అజీర్తి దూరం అవ్వాలంటే ఫైబ‌ర్ ఎంతో అవ‌స‌రం.అందుకే ఐదారు నెల‌లు నిండిని పిల్ల‌ల‌కు యాపిల్‌, అవోకాడో వంటి పండ్ల‌తో ప్యూరీ చేసి పెడితే.వారికి ఫైబ‌ర్ అంది అజీర్తి త‌గ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube