ఈ నూనెతో కలిపి ఎగ్స్ ని తింటే బరువు తగ్గిపోతారట.. తెలుసా?

ఎగ్స్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.ఎగ్ తో వివిధ రకాల వెరైటీస్ చేసుకొని తింటుంటారు.

 Do You Know How To Lose Weight By Eating Eggs-TeluguStop.com

అయితే ప్రతిరోజు ఒక ఎగ్ తినడం ద్వారా మన శరీరానికి ఎన్నో పోషక విలువలు అందుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎగ్స్ ను ఎన్నో రకాలుగా, ఎంతో రుచిగా తింటారు.

ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఎగ్స్ ను తినడం వల్ల మన శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉండేలా ఎగ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

 Do You Know How To Lose Weight By Eating Eggs-ఈ నూనెతో కలిపి ఎగ్స్ ని తింటే బరువు తగ్గిపోతారట.. తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బరువును నియంత్రించడంలో కూడా ఎగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి.కొద్ది పరిమాణంలో ఎగ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి ఇతర ఆహారపదార్థాల వైపు మనసు వెళ్లకుండా ఆపుతుంది.

ప్రతిరోజు మన ఆహారంలో ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి.అంతేకాకుండా ఎగ్ లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి.

అధిక మొత్తంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.
ఎగ్స్ తయారు చేసుకునే విధానం లో వివిధ రకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే అన్ని రకాల నూనెలలో ఓకే రకమైన ఫ్యాట్ ను కలిగి ఉండదు.కొన్ని నూనెలు వంటల్లో వాడటం వల్ల అధిక బరువు పెరుగుతారు.

మరికొద్ది నూనెలలో తక్కువగా కలిగి ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి దోహదపడతాయి.ఎగ్స్ సోయాబీన్ ఆయిల్ ఉపయోగించి చేయటం ద్వారా శరీర అధిక బరువు పెరగటానికి దోహద పడుతుంది.

కానీ ఎగ్స్ ను కొబ్బరి నూనె ఉపయోగించి చేయటం ద్వారా మన నడుము చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.చెడు కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

#Soybean Oil #Eggs #Coconut Oil #Bad Cholesterol #Sugar Levels

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు