మీకు వాట్సాప్‌లో ‘బుక్‌మార్క్‌’ పెట్టుకోవడం తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తమ వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది.అందుకే ప్రతిరోజూ ఏదో ఒక నయా ఫీచర్‌ను పరిచయం చేస్తూనే ఉంటుంది.

 Do You Know How To Bookmark Whatsapp Messages-TeluguStop.com

దీనికి వినియోగదారులు కూడా ప్రపంచవ్యాప్తంగా బిలియన్లలో ఉన్నారు.సాధారణంగా వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు, టెక్ట్స్, వీడియోస్, ఫోటోస్‌ను షేర్‌ చేసుకోవచ్చు.

అయితే చాట్‌ ఆప్షన్‌లో గతం వచ్చిన మెసేజ్‌లు ఏవైనా ముఖ్యమైనవి అయి ఉండవచ్చు.వీటిని చాట్‌లో వెతుక్కునే పనిలేకుండా సులభంగా అటువంటి మెసేజ్‌లు చూడవచ్చు.

 Do You Know How To Bookmark Whatsapp Messages-మీకు వాట్సాప్‌లో ‘బుక్‌మార్క్‌’ పెట్టుకోవడం తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ అయిన వాట్సాప్‌ దీనికి ‘స్టార్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుంది.అంటే మీకు ముఖ్యమైన మెసేజ్‌లను బుక్‌మార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ మెసేజ్‌లను మీకు అవసరమైనపుడు చూసుకునే వీలు ఉంటుంది.అయితే, ఆ చాట్స్‌కు బుక్‌ మార్క్‌ ఎలా పెట్టుకోవాలి.

వాటిని మళ్లీ చూడాలంటే ఎలా చదవాలి? ప్రాసెస్‌ ఎంటో తెలుసుకుందాం.బుక్‌మార్క్, స్టార్‌ వాట్సాప్‌లో ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం.

వాట్సాప్‌ చాట్‌కు బుక్‌ మార్క్‌ పెట్టుకునే విధానం…

ముందుగా దీనికి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌ చేసి, వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి.ఆ తర్వాత మీకు కావాల్సిన వ్యక్తి లేదా గ్రూపు చాట్‌ దేనికి బుక్‌ మార్క్‌ పెట్టాలో దాన్ని ఓపెన్‌ చేయాలి.అందులోని ఆ ముఖ్యమైన మెసేజ్‌ను సెలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.దాన్ని ఎంచుకున్న వెంటనే చాట్‌ విండో ట్యాబ్‌లో మీకు స్టార్‌ ఐకాన్‌ కనిపిస్తుంది.అప్పుడు ఆ స్టార్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే మీకు కావాల్సిన మెసేజ్‌లు బుక్‌ మార్క్‌ అయిపోతాయి.మీకు అవసరం లేనప్పుడు ఆ మెసేజ్‌లకు బుక్‌ మార్క్‌ తొలగించడం కూడా సులభం.

దీనికి వాట్సాప్‌ ఓపెన్‌ చేసి.స్టార్డ్‌ మెసేజెస్‌ను ట్యాప్‌ చేసి హొల్డ్‌ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత అన్‌స్టార్‌ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది.

బుక్‌ మార్క్‌ మెసేజ్‌లను చూడటం…

వాట్సాప్‌ ఓపెన్‌ చేసి.కుడివైపు మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.ఆ తర్వాత డ్రాప్‌ డౌన్‌ మెనూలో ‘స్టార్డ్‌ మెసేజెస్‌’ను సెలెక్ట్‌ చేసుకోవాలి.

అప్పుడు మీరు బుక్‌ మార్క్‌ పెట్టిన అన్ని మెసేజ్‌లు అక్కడ కనిపిస్తాయి.

#Whatsapp Tricks #Whatsapp Chat #Sapp #Messages Sapp #BookmarkSapp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు