అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి అధికార భవనం వైట్ హౌస్ అనే విషయం అందరికీ తెలిసిందే.అయితే అమెరికా నూతన అధ్యక్షుడిగా మరి కొన్ని గంటలలో డెమొక్రటిక్ పార్టీ అధినేత జోసెఫ్ బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.
ఇందులో భాగంగానే ఇప్పటికే క్యాపిటల్ హిల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడికి వైట్ హౌస్ ను అధికార భవనంగా ఇవ్వనున్నారు.
ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ హౌస్ నిర్మాణం జరిగి ఇప్పటికి 210 సంవత్సరాలయింది.ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ హౌస్ కు వైట్ హౌస్ అనే పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం…
ఈ వైట్ హౌస్ చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ హౌస్ నిర్మించి 210 సంవత్సరాలు అయినప్పటికీ ఈ ఇంటికి వైట్ హౌస్ అనే పేరును ఇది నిర్మించిన వంద సంవత్సరాలకు ఆ పేరు పెట్టారు.అంతకు మునుపు ఈ హౌస్ ను ప్రెసిడెంట్స్ ప్యాలెస్ అని, ఎగ్జిక్యూటివ్ మాన్షన్ అని పిలుచుకునేవారు.
ఈ విధమైన పేరుతో కొనసాగుతున్న ఈ హౌస్ లో ఒకసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదం తర్వాత ఈ ప్యాలెస్ మొత్తం తెల్లటి రంగును వేయటం వల్ల అప్పటి నుంచి ఈ ప్యాలెస్ ను వైట్ హౌస్ అని పిలుస్తున్నారు.1901 లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రూజ్‌వెల్ట్ ఈ పేరును వాడటం మొదలెట్టడంతో అప్పటి నుంచి ఈ ప్యాలెస్ కు ఆపేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

అమెరికా మొదటి అధ్యక్షుడు అయిన జార్జి వాషింగ్టన్ తన కలను సాకారం చేసుకోవడానికి 1791 లో వైట్ హౌస్ నిర్మించటానికి స్థలాన్ని ఎంచుకున్నారు.1792 లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి పూజా కార్యక్రమం చేసి మొదలుపెట్టారు.ఐరిష్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబన్ రూపొందించారు.
రెండో అమెరికా అధ్యక్షుడు అయిన జాన్ ఆడమ్స్ హయాంలో ఈ ప్యాలెస్ నిర్మాణం పూర్తి చేశారు.అప్పట్లోనే ఈ ప్యాలెస్ 13 కోట్ల రూపాయలతో నిర్మించారు.
ఆరు అంతస్తులు కలిగిన ఈ భవనం కంచతో కలిపి మొత్తం 18 ఎకరాలు ఉంది.ఈ వైట్ హౌస్ లో132 గదులు,142 తలుపులు, 147 కిటికీలు, 35 బాత్రూంలు, 5,700 మంది పని వాళ్ళు ఉన్నారు.అంతేకాకుండా ఈ హౌస్ భూగర్భంలో బంకర్ కూడా ఉంది.అత్యవసర పరిస్థితులలో అధ్యక్షుడు ఇక్కడినుంచి విధులు నిర్వర్తించడానికి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
కొన్ని స్వరంగా అ మార్గాలు కూడా ఉన్నాయి.