మీరు రోజూ తినే బ్రెడ్ తొలుత ఎలా త‌యార‌య్యిందో తెలుసా?

మీరు రోజూ తినే బ్రెడ్ తొలుత ఎలా త‌యార‌య్యిందో తెలుసా?నేను బ్రెడ్‌ను.మీరు రోజూ ఉదయం రెండు ముక్కలు తిన్న తర్వాత ఆఫీసుకు లేదా పాఠశాలకు వెళ్లినప్పుడు, మీరు ఎప్పుడైనా నా కథ తెలుసుకోవాలని ప్రయత్నించారా? ఆ ప‌ని చేసి ఉండరు… పర్వాలేదు.ఈ రోజు నా కథను నేనే చెబుతాను వినండి.ముందుగా భారతదేశంలో మీరు నన్ను ఏ రూపంలో ఇష్టపడుతుంటారో గుర్తు చేసుకుందాం.కొన్నిసార్లు మీరు బ్రెడ్‌కు జామ్ అప్లై చేయడం ద్వారా బ్రెడ్ తింటారు.కొన్నిసార్లు మీరు టోస్ట్ తయారు చేసి టీతో ఆనందంగా తింటారు.

 Do You Know How The Bread You Eat Every Day Was Originally Made ,bread , Jam For-TeluguStop.com

చాలా సార్లు మీరు మీ ఇంటిలో మిగిలిన కూరగాయలను క‌ట్‌ చేసి దానితో శాండ్‌విచ్‌ను తయారు చేసి తింటారు.

బ్రెడ్ అంటే ఏమిటి?అన్నింటిక‌న్నా ముందుగా బ్రెడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. బ్ర‌డ్ త‌యారు చేయడానికి అవసరమైన ముఖ్యమైన వస్తువులు పిండి (మైదా లేదా గోధుమ పిండి), నీరు, ఉప్పు మరియు ఈస్ట్.చ‌పాతీ చేయడానికి మీకు పిండి, నీరు అవసరం.

కానీ బ్రెడ్ త‌యారీకి ఉప్పు మరియు ఈస్ట్ కూడా అవసరం.బ్రెడ్‌లో ఉప్పు కలుపుతారు ఎందుకంటే ఇది సహజ యాంటీఆక్సిడెంట్ మరియు సహజ సంరక్షణకారిగా పనిచేస్తుంది.

బ్రెడ్‌ చాలా రోజులు పాడవకుండా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.బ్రెడ్ తయారీ పిండికి ఉప్పు కలపడం వల్ల బ్రెడ్ రుచి కూడా పెరుగుతుంది.

ఉప్పు వల్ల గ్లూటెన్ స్ట్రాండ్స్ బలంగా మారుతాయి.అంటే ఉప్పు వల్ల పిండికి మంచి సాగే గుణం వచ్చి త్వరగా విరిగిపోదు.

బ్రెడ్‌లో ఈస్ట్ కూడా కలుపుతారు.ఇది శిలీంధ్రాల సమూహంలో భాగమైన ఒకే కణ సూక్ష్మ జీవి.</br>

Telugu Bread, Jam Bread, Louis Pasteur, Sandwich, Toast-Latest News - Telugu

బ్రెడ్ చరిత్ర1857లో, లూయిస్ పాశ్చర్ కిణ్వ ప్రక్రియ గురించి శాస్త్రీయ సమాచారాన్ని అందించాడు.అయితే రొట్టె త‌యారు చేయడానికి కిణ్వ ప్రక్రియ అప్పటికే ఉపయోగించబడింది.అయితే అది ఎలా అనే దాని గురించి సమాచారం ఎవ‌రికీ తెలియదు.వాస్తవానికి బ్రెడ్‌ చరిత్ర క్రీస్తుపూర్వానికి ముందు అనేక వేల సంవత్సరాల క్రిత‌మే ఉంది.ఈజిప్టులో ఒక బేకర్ ఫ్లాట్ బ్రెడ్ తయారు చేసేవాడ‌ని చెబుతారు.అత‌ను బాగా పిసికిన పిండిని చాలా సేపు ఓపెన్‌లో వదిలేశాడు.

Telugu Bread, Jam Bread, Louis Pasteur, Sandwich, Toast-Latest News - Telugu

అప్పుడు అతను దాని నుండి ఫ్లాట్ బ్రెడ్ చేయాలనుకున్నప్పుడు, అది ఉబ్బి, ఈ విధంగా కొత్త రకం బ్రెడ్ త‌యార‌య్యింద‌ట‌.గాలిలో ఉండే ఈస్ట్ పిండితో మిళిత‌మ‌య్యింది.దాని కారణంగా బ్రెడ్ సైజు పెరిగింది.ఆ తర్వాత శతాబ్దాల తరబడి అదే విధంగా పిండిని పులియబెట్టి బ్రెడ్ తయారు చేసేవారు.సుమారు 2000 సంవత్సరాల క్రితం రోమ్‌లో బ్రెడ్ బేకింగ్ ఒక కళగా పరిగణించారు.ఈ పని చేసేవారిని ఎంతో గౌరవంగా చూసేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube