టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కు 'లార్డ్ ' అని పేరు ఎలా వచ్చిందో తెలుసా..?!

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా జట్టుతో రెండో టెస్టు ఆడుతోంది.ఈ మ్యాచ్‌లో రెండో రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

 Tdo You Know How Team India Bowler Shardul Thakur Got The Name 'lord'? Team Ind-TeluguStop.com

ఇంత తక్కువ పరుగులకే ఆలౌట్ కావడానికి బౌలర్ శార్దూల్ ఠాకూర్‌యే కారణం.అతడు ఏకంగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

దీంతో అతన్ని లార్డ్ అంటే దేవుడుగా పిలవడం ప్రారంభించారు అభిమానులు.పాల్గర్ ఎక్స్‌ప్రెస్… లార్డ్ శార్దూల్ అంటూ సోషల్ మీడియాని అతని పేరుతో హోరెత్తించారు.

ఏడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా టీం పతనాన్ని శాసించిన శార్దూల్ ఠాకూర్‌ను మళ్లీ లార్డ్ శార్దూల్ అంటూ పిలవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.మొట్టమొదటిగా శార్దూల్ ను ఎవరు లార్డ్ గా కీర్తించారనేది ఇప్పుడు చర్చలకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్‌ ఓ ఆసక్తికర విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు.” లార్డ్‌ అనే పేరు ఎవరు పెట్టారో నాకు తెలియదు.కానీ 2021లో భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ టైమ్ లో లార్డ్ శార్దూల్ అనే పేరు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.ఈ సిరీస్‌లో నేను బాగా ఆడాను. కేవలం ఒకే ఒక ఓవర్లో రెండు చొప్పున వికెట్లు పడగొట్టాను అందుకే, ఆ సిరీస్ ఆడిన సమయం నుంచి “లార్డ్ శార్దూల్” అనే పేరు సూపర్ ఫేమస్ అయ్యింది.” అని వెల్లడించాడు.

Telugu Latest, Lord, India-Latest News - Telugu

ఇదిలా ఉండగా రెండో టెస్టులో శార్దూల్ ఠాకూర్‌ 61 పరుగులు ఇచ్చి 7 వికెట్లను తీశాడు.ఈ అద్భుతమైన ప్రదర్శనపై సచిన్‌ టెండూల్కర్, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్‌ సింగ్‌ వంటి తాజా క్రికెట్ ప్లేయర్లు ప్రశంసల వర్షం కురిపించారు.“ప్రత్యేకమైన బౌలింగ్‌తో 7 వికెట్లు పడగొట్టిన శార్దూల్‌కు అభినందనలు” అని సచిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు శార్దూల్.“క్రికెట్‌ దేవుడే స్వయంగా నా గురించి ట్వీట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఇలాంటి ప్రశంసలు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి” అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube