సుదర్శన్ కు గుండు సుదర్శన్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ప్రముఖ నటుడు, రచయిత, దాదాపు 350 సినిమాల్లో నటించిన హాస్య నటుడు గుండు సుదర్శన్. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు గుండు సుదర్శన్.పది సంవత్సరాల వయసు నుంచే నాటకాలలో నటించిన అనుభవం గుండు సుదర్శన్ ది.1993 లో బాపు దర్శకత్వంలో వచ్చిన మిష్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, హైదరాబాదులోని జె.ఎన్.టి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ కూడా చేశారు.అంతే కాకుండా మనస్తత్వ శాస్త్రంలో పట్టాను కూడా సంపాదించారు.

 Do You Know How Sudarshan Got Name As Gundu Sudarshan Details, Sudarshan, Gundu-TeluguStop.com

సినిమాలలో పూర్తి స్థాయి నటుడు కాక మునుపు తన స్వస్థలమైన భీమవరం లోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా కొన్నాళ్ళు పని చేశారు.నటన పై మక్కువతో తెలుగు సినిమాలలో హాస్యనటుడిగా రాణిస్తూ.ఖాళీ సమయాలలో విద్యార్థులకు, ఉద్యోగులకు స్ఫూర్తి దాయక ఉపన్యాసాలు ఇస్తుంటారు గుండు సుదర్శన్.

సినిమా ప్రపంచం అర్ధం అవడానికి, కాకపోవడానికి అదేం పాఠం కాదు కదా అన్న సుదర్శన్, నిజంగా చెప్పాలంటే సినిమా రంగం మనకు పాఠాలేమీ చెప్పదని ఆయన అన్నారు.

Telugu Gundu Sudarshan, Bapu, Mister Pellam, Sudarshan, Tollywood-Movie

అది పరీక్షలు పెడుతుంది అంతే.ఇంకా చెప్పాలంటే సినిమా రంగానికి మనమే అర్ధం అవ్వాలని ఆయన తెలిపారు.అదే ముఖ్యం అని గుండు సుదర్శన్ అన్నారు.

ఇక ఇతని పేరు విష్ణు మాయ సుదర్శన్ అని గుండు సుదర్శన్ అని కూడా పిలుస్తుంటారు.విష్ణుమాయ సుదర్శన్ అనే పేరు మిస్టర్ పెళ్ళాం ద్వారా వచ్చిందని, ఆ తర్వాత బాపు గారు సుదర్శన్ అని పిలుస్తూ ఉండేవారు.

అయితే గుండు ఉండటం వల్ల అందరూ గుండు సుదర్శన్ అని పిలుస్తూ ఉండటం వల్ల అదే పేరు నిలిచిపోయిందని ఓ సందర్భంలో గుండు సుదర్శన్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube