ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా?

పాలు అనేది మన నిత్య జీవితంలో ఒక పెద్ద అవసరంగా మారిపోయింది.ఉదయం లేవగానే మన జీవితాన్ని పాలతోనే ప్రారంభిస్తారు.

 Process Of Making Packet Milk, Packet Milk, Made,centrifuge,oxidized Cholestero-TeluguStop.com

పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని పాలలో పోషక పదార్థాలు అధికంగా ఉండటం వల్ల, పాలను తాగినప్పుడు మన శరీరానికి ఆ పోషక విలువలు అందుతాయి.అందుకోసమే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పాలను అధికంగా తీసుకుంటూ ఉంటారు.

పట్టణంలో నివసించేవారు దాదాపు 90 శాతం మంది ప్రజలు కృత్రిమంగా లభ్యమయ్యే పాల ప్యాకెట్లను వాడుతున్నారు.ఈ పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావించి ప్యాకెట్ పాలను వాడుతున్నారు.

కానీఅధికంగా పాల ప్యాకెట్లను వాడటం ద్వారా అధికంగా అనారోగ్య సమస్యలకు గురవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.అసలు పాల ప్యాకెట్లు ఎలా తయారు అవుతాయో, వాటిని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవుతారో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా పాలను సెంట్రిఫ్యూజ్ పద్ధతి ద్వారా పాలలో ఉన్న ప్రోటీన్లను, కొవ్వు పదార్థాలను తొలగించి వాటిని పాశ్చరైజేషన్ చేసిన తర్వాత ప్యాకెట్లలో నింపి మార్కెట్ తరలిస్తుంటారు.

ఇలాంటి పాలలో కొలెస్ట్రాల్ ను తొలగించడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తుంటారు.ఇందులో ఏర్పడే సహజమైన కొలెస్ట్రాల్ ను ఐస్ క్రీం ల తయారీలో ఉపయోగిస్తారు.

కానీ పాల ప్యాకెట్ లో లభ్యమయ్యే పాలలోకి పాల పొడిని పాశ్చరైజేషన్ పద్ధతి ద్వారా తయారు చేస్తారు ఈ పాల పొడికి ఎక్కువ వత్తిడిని కలిగించి, చిన్న రంధ్రం ద్వారా గాలిలోకి పిచికారి చేయడం ద్వారా ఇందులో ఉన్న కొవ్వు పదార్థాలు గాలిలో ఉన్న నైట్రేట్స్‌తో కలసి ఆక్సిడెట్ అవ్వడం వల్ల ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ గా మారుతుంది.

మన శరీరానికి కొలెస్ట్రాల్ ఎంతో మంచిది.

కానీ ఈ ఆక్సైడ్ కొలెస్ట్రాల్ మన శరీరంలోకి ప్రవేశించడం ద్వారా రక్త నాళాలలను కుచించుకు పోయేలా చేసి అనేక గుండె సమస్యలకు కారణమవుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.పాల ప్యాకెట్ల లోని పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అందులో పోర్సిలిన్ అనే రసాయనాన్ని కలపడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది.

ఇటువంటి పాలను తాగినప్పుడు స్త్రీలలో హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడి నెలసరి లో అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
గర్భిణీ స్త్రీలు ఈ పాలను తాగడం వల్ల శిశువు పెరుగుదల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

చిన్న పిల్లలకు వీటిని తాకడం ద్వారా వాంతులు, విరేచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురిఅవుతారు కావునవీలైనంత వరకు సహజంగా దొరికే పాలను తాగడం వల్ల నిజమైన పోషక విలువలను మనం పొందగలము.అలా కాకుండా పాల ప్యాకెట్లు తీసుకున్నప్పుడు వాటిలో కొద్దిగా నీటిని కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా కొంతవరకైనా ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube