ఈ ఫోటోలో ఎంత విలువైన సమాచారం దాగి ఉందో తెలుసా..?!

పైన కనిపిస్తున్న శిల్పాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు గుడి గోడలపై 13 వ శతాబ్దంలో చెక్కబడినవి.ఈ శిల్పాలను చూస్తుంటే నలుగురు మహిళలు ఒక గర్భవతి కి ప్రసవ సమయంలో సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Do You Know How Much Valuable Information Is Hidden In This Photo, Temple Photos-TeluguStop.com

ఇద్దరు మహిళలు ఓ గర్భవతిని తమ భుజాలపై మోస్తుండగా.మరొక ఇద్దరు మహిళలు గర్భవతి కాళ్లను తమ భుజాలపై మోస్తూ కడుపులోని బిడ్డను బయటకు తీస్తున్నారు.

ఒక మహిళ.గర్భవతి పొత్తి కడుపుపై చెయ్యి పెట్టి ఏదో చేస్తున్నట్టు కూడా చూడొచ్చు.

అయితే ఈ శిల్పాలలో గర్భవతి యొక్క ప్రసవ స్థానం నిట్టనిలువుగా ఉండటం ముఖ్యంగా గమనించాల్సిన విషయం.ఒక గర్భవతి నుంచి బిడ్డను తీయడానికి నిట్టనిలువు స్థానాన్ని ఎంపిక చేసుకోవడం వలన త్వరగా పని అయిపోతుందని చెప్పుకోవచ్చు.

ఏడు వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఈ విషయాన్ని కనిపెట్టారు.బిడ్డతల్లి ప్రసవ సమయంలో ఎటువంటి నొప్పి అనుభవించకుండా ఉండేందుకు ప్రసవ స్థానాలలో నిట్టనిలువు పొజిషనే ఉత్తమమైనదని శిల్పాల ద్వారా పూర్వీకులు మనకు వెల్లడించారు.

బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ శిల్పాల వెనుకున్న అసలైన సైన్స్ ని తెలుసుకున్నారు.పూర్వీకులు కనిపెట్టిన ఈ పద్ధతి చాలా బెటర్ అని ప్రముఖులు చెబుతున్నారు.

సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టే బిడ్డ బరువు 2.8 కిలోలు ఉంటుంది.ఆ బిడ్డ కొంత ఎత్తులో ఉంటే గురుత్వాకర్షణ శక్తి బిడ్డను 27N ఫోర్స్ తో కిందికి లాగుతుంది.అంటే ప్రసవిస్తున్న సమయంలో తల్లి కష్టపడకుండానే గురుత్వాకర్షణశక్తి బిడ్డను బయటకు లాగుతుంది.

శిల్పాలలో చూపించిన పొజిషన్ లో తల్లిని ఉంచితే ఆమెకు ఎటువంటి నొప్పి కూడా రాదట.ఈ పొజిషన్ లో బిడ్డ బయటకు వస్తే బిడ్డకు మంచిగా ఆక్సిజన్ దొరుకుతుందట.

నిట్టనిలువు పోజిషన్ లో ప్రసవిస్తే.బిడ్డ సరిగా బయటకు వస్తాడట.

వీపు పై పడుకొని ప్రసవించడం కంటే ఇలా అప్ రైట్ పోసిషన్ లో బిడ్డను కనడం వలన తల్లికి సైకలాజికల్ గా కూడా మంచి ఉపశమనం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏది ఏమైనా ఈ శిల్పాల వెనుక కూడా ఇప్పటి ప్రజలకు కూడా ఉపయోగపడే సైన్స్ చాలా దాగి ఉందని చెప్పుకోవచ్చు.

గ‌తంలో ఈజిప్ట్ , గ్రీకులు ఇదే ప‌ద్ద‌తిని అనుసరించే వారట.కానీ గడుస్తున్న కొద్దీ ప్ర‌స‌వ ప‌ద్ద‌తులు మారుతూ వ‌చ్చాయి.అలా మారుతూ వచ్చి ప్రస్తుతం C- సెక్ష‌న్ డెలివరీ పద్ధతులు బాగా నడుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube