శ‌రీరానికి `సెలీనియం` ఎంత అవ‌స‌ర‌మో తెలుసా?

శ‌రీరానికి కావాల్సిన ముఖ్య‌మైన పోష‌కాల లో సెలీనియం ఒక‌టి.అయితే మినరల్స్ జాబితాకు చెందిన‌ ఈ సెలీనియం గురించి చాలా మందికి అవ‌గాహ‌నే లేదు.

 Do You Know How Much Selenium The Body Needs Details, Selenium, Human Body, Late-TeluguStop.com

అస‌లు సెలీనియం శ‌రీరానికి ఎందుకు అవ‌స‌రం.? శ‌రీరంలో సెలీనియం చేసే ప‌నేంటి.? సెలీనియం ఏ ఏ ఆహారాల్లో పుష్క‌లంగా ఉంటుంది.? వంటి విష‌యా‌లు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ హార్మోన్లు స‌రిగ్గా ప‌ని చేయాలంటే సెలీనియం ఎంతో అవ‌స‌రమ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.శ‌రీరానికి స‌రి ప‌డా సెలీనియం అందిన‌ప్పుడే థైరాయిడ్ హార్మోన్లు స‌క్రమంగా ప‌ని చేస్తాయి.

త‌ద్వారా మెటబాలిజం రేటు మెరుగు ప‌డి శ‌రీర బ‌రువు కంట్రోల్ త‌ప్ప‌కుండా ఉంటుంది.

ఫ్రీ ర్యాడికల్స్‌ సంఖ్య పెరిగే కొద్ది శరీరంలో కణాలు దెబ్బ తింటాయి.అంతే కాదు.గుండె జబ్బులు, డయాబెటిస్ మ‌రియు ఇత‌రిత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తాయి.

అయితే శ‌రీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను వేగంగా అంతం చేసేందుకు సెలీనియం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

Telugu Tips, Latest, Selenium, Selenium Foods, Seleniumrich-Telugu Health - త�

అలాగే సెలీనియంకు ప్రాణాంత‌క‌ర వ్యాధుల్లో ఒక‌టైన క్యాన్స‌ర్‌ను అడ్డుకునే సామ‌ర్థ్యం కూడా ఉంది.అవును, సెలీన‌యం బాడీలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.అదే స‌మ‌యంలో శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేసి అనేక జ‌బ్బుల‌ను ద‌రి చేర‌కుండా ర‌క్ష‌ణ‌ను కూడా క‌ల్పిస్తుంది.

అందుకే సెలీనియంను శ‌రీరానికి రోజూ అందించాలి.

Telugu Tips, Latest, Selenium, Selenium Foods, Seleniumrich-Telugu Health - త�

ఇక సెలీనియం ఏ ఏ ఆహారాల్లో ఉంటుందంటే.ఓట్స్, బాదంపప్పు, చికెన్‌, రొయ్యలు, బ్రెజిల్‌ నట్స్‌, మ‌ట‌న్‌, పనీర్‌, బ్రౌన్‌ రైస్‌, కోడి గుడ్లు, పుట్ట గొడుగులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలు, బీన్స్‌, పాలు, పెరుగు, వెల్లుల్లి వంటి ఆహారాల్లో సెలీనియం పుష్క‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి ఈ ఆహారాల‌ను ఆహారంతో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube