సినిమాల ద్వారా సమంతా ఎంత సంపాదించిందో తెలుసా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంతా.ప్రస్తుతం ఈమెకు మంచి డిమాండ్ ఉంది.

 Do You Know How Much Samantha Earned In Movies-TeluguStop.com

ఒక్కో సినిమాకు తను రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది.అయితే ఏమాయ చేసావె సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత వరుస అకాశాలతో ముందుకు వెళ్లింది.తక్కువ కాలంలోనే అద్భుత సినిమాలు చేసి.

 Do You Know How Much Samantha Earned In Movies-సినిమాల ద్వారా సమంతా ఎంత సంపాదించిందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాప్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

బాలీవుడ్ లోనూ ఆఫర్లు పొందుతుంది.

ఇప్పటి వరకు సుమారు 65 సినిమాల్లో నటించింది సమంతా.

అక్కినే అబ్బాయి నాగ చైతన్యతో వివాహం అయిన తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది.గ్లామర్ పాత్రలు కూడా చేస్తూ జనాలను అలరిస్తుంది.

ది ఫ్యామిలీ మెన్-2 అనే సిరీస్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇందులో రాజీ పాత్ర పోషించి నటనతో అదరగొట్టింది.

ఎంతో కష్టపడి నటించిన సమంతా ఇందులో నటనకు గాను సుమారు 4 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంది.

Telugu Amaiya Chesava, Family Men 2, Nagachaitanya, Remunartion, Samantha, Tollywood, Web Series-Telugu Stop Exclusive Top Stories

మొత్తంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అచిర కాలంలోనే సమంతా భారీగా డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆమె దగ్గర 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.సినిమాలతో పాటు పలు వ్యాపారాలు కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అందులోనూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.

Telugu Amaiya Chesava, Family Men 2, Nagachaitanya, Remunartion, Samantha, Tollywood, Web Series-Telugu Stop Exclusive Top Stories

మంచి బిజినెస్ వుమెన్ గా రాణిస్తుంది.సమంతాకు సంబంధించి హైదరాబాద్ లో విలువైన బంగళాలు, కార్లు ఉన్నాయట.వీటన్నింటిని తన సొంత సంపాదనతోనే తీసుకుందట.

అటు తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు సైతం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా అక్కినేని చైతన్య- సమంతా విడిపోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే వీటిలో ఎంత మేరకు వాస్తవం ఉందనేది మాత్రం తెలియట్లేదు.అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఎవరో ఒకరు నోరు విప్పితే తప్ప అసలు విషయాలు బయటకు తెలియదు.

#Web #Samantha #Amaiya Chesava #Nagachaitanya #Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు