రామ్‌ జెఠ్మలానీ లాయర్‌గా తీసుకునే ఫీజు ఎంతో తెలుసా?

9 పదుల వయసులో కూడా కోర్టుకు వెళ్లి తాను వకాల్తా పుచ్చుకున్న వ్యక్తులను నిర్దోషులుగా నిరూపించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేయడంతో పాటు అవతలి లాయర్‌ను బెంబేలు ఎత్తించగల సత్తా ఉన్న లాయర్‌ రామ్‌ జెఠ్మలానీ, ఎంతో మంది రాజకీయ ప్రముఖుల కేసులను వాదించిన వ్యక్తి.న్యాయం ఎటు వైపు ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా కోట్లు ఎవరు ఇస్తే వారి వైపు వాదిస్తాడనే విమర్శలు ఉన్నాయి.

 Do You Know How Much Fee Take Ram Jethmalani-TeluguStop.com

ఆయన వాదనలు ఎలా ఉన్నా కూడా జడ్జ్‌ స్థానంలో ఉన్న వారు ఆయన్ను సమర్ధించాల్సిందే అంటూ కూడా విమర్శళు ఉన్నాయి.అంతటి విమర్శలు ఉన్న రామ్‌ జెఠ్మలానీ ఒక్క కేసుకు ఎంత తీసుకుంటాడో తెలిస్తే అవాక్కవుతారు.

కేసు తీవ్రతను బట్టి కోటి నుండి 10 కోట్లు 100 కోట్ల కూడా ఆయన తీసుకున్న దాఖలాలు ఉన్నాయనే టాక్‌ ఉంది.ఒక్కసారి కోర్టుకు రావాలంటే కోట్లు కురిపిస్తే కాని ఆయన రాడు.

ఆయన చుట్టు ఉన్న పదుల సంఖ్యల లాయర్‌లకే లక్షలు ఖర్చు చేస్తారు.అలాంటిది ఆయనకు ఏకంగా కోట్ల ఫీజును చెల్లించాల్సిందే.

డబ్బుతో కొన్ని సార్లు ఆయన తప్పు చేసిన వారిని కాపాడాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.ఎన్నో సార్లు ఆయన గెలిచిన కేసుల్లోని ప్రత్యర్థులు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇక రామ్‌ జెఠ్మలానీ ఎలాంటి వాడయినా కూడా నేడు ఆయన మృతితో దేశం మొత్తం సంతాపం తెలుపుతోంది.ప్రధాని మోడీ ఇంకా ఇతర బీజేపీ నాయకులు తమ సంతాపంను తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube