పీకేకు జగన్‌ ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా?  

Do You Know How Much Amount Jagan Give To The Prashanth Kishore-jagan,jagan Give The Contracts To Prashanth Kishore,prashanth Kishore

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం వెనుక రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్‌ కిషోర్‌ పాత్ర ప్రముఖంగా ఉందనే విషయం తెల్సిందే.ఆయన వ్యూహాల కారణంగానే నేడు జగన్‌ సీఎం పీఠంను ఎక్కినట్లుగా రాజకీయ వర్గాల వారు బలంగా నమ్ముతున్నారు.

గతంలో మోడీకి ఆ తర్వాత పలువురు ముఖ్యమంత్రులకు తన వ్యూహాలను ఇచ్చాడు.జగన్‌ వెంట గత సంవత్సర కాలంగా నడుస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ టీం సీఎం అయ్యే వరకు వెంటే నిలిచింది.అందుకే పీకేకు జగన్‌ భారీగా రెమ్యూనరేన్‌ ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి.

Do You Know How Much Amount Jagan Give To The Prashanth Kishore-jagan,jagan Give The Contracts To Prashanth Kishore,prashanth Kishore Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys C-Do You Know How Much Amount Jagan Give To The Prashanth Kishore-Jagan Jagan Contracts Kishore

ఇటీవల వైకాపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన తమ ఖర్చుల లెక్కలో ప్రశాంత్‌ కిషోర్‌కు ఎంత ఇచ్చాం అనేది తెలియజేసింది.37.5 కోట్ల రూపాయలను ప్రశాంత్‌ కిషోర్‌కు జగన్‌ ఇచ్చినట్లుగా ఆ లెక్కలో వెళ్లడి చేయడం జరిగింది.

కాని ఈ లెక్క ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని జనాలు అంటున్నారు.వందల కోట్ల రూపాయలను ప్రశాంత్‌ కిషోర్‌కు వైకాపా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ప్రశాంత్‌ కిషోర్‌కు వేల కోట్ల రూపాయలు కలిసి వచ్చేలా ప్రభుత్వ పనులు కూడా ఇచ్చి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి ప్రశాంత్‌ కిషోర్‌ పారితోషికం విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.