కొబ్బరినూనె ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందా? తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు!

కొబ్బరి నూనె.( Coconut oil ) దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 Do You Know How Many Ways Coconut Oil Is Useful Details? Coconut Oil, Coconut Oi-TeluguStop.com

చాలామంది కొబ్బరినూనెతో వంటలు చేస్తుంటారు.ఇక కొందరు కురుల సంరక్షణకు( Hair care ) కొబ్బరి నూనెను విరివిరిగా ఉపయోగిస్తారు.అంతేనా అనుకుంటే పొరపాటే.కొబ్బరి నూనెతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కొబ్బరి నూనె మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

చాలామంది కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు( Dark circles ) ఉన్నాయని తీవ్రంగా బాధపడుతుంటారు.

అలాంటి వారు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బ‌రి నూనె, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు మాయం అవుతాయి.

అలాగే పెదాల నలుపు వదిలించడానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది.రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో వన్ టేబుల్ స్పూన్ పంచ‌దార‌ వేసి బాగా కలిపి పెదాలపై అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే నల్లటి పెదాలు ఎర్రగా అందంగా మారతాయి.

పసుపు దంతాలను ముత్యాల మాదిరి మెరిపించడానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కలిపి దంతాలపై అప్లై చేసుకుని.రెండు నిమిషాల పాటు బ్రష్ తో తోముకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి.

ఇక పాదాల పగుళ్ళుతో సతమతం అయ్యేవారు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ ను మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయాలి.ఇలా రోజు నైట్ నిద్రించే ముందు చేస్తే పాదాల పగుళ్ళ నుంచి విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube