ఏటీఎంలోని సీసీ కెమెరా ఎన్ని ప‌నులు చేస్తుందో తెలుసా?

మీరు ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లినప్పుడు మెషీన్‌కు కుడివైపు ఎగువ మూలలో చూడండి.మీకుతెల్లటి స్లాట్ క‌నిపిస్తుంది.

 Do You Know How Many Tasks The Cctv Camera Details, Cash Withdraw People Bank, Atm, Cctv Camera, Atm Cctv Camers, Atm Machines, Banks, Money, Face Detection, Recognition System, Video Solution System-TeluguStop.com

ఇందులో ఫోటో రావ‌డాన్ని మీరు గ‌మ‌నించ‌వ‌చ్చు.ఇది ఏమిటి? దాని పనితీరు ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది డబ్బు విత్‌డ్రా చేసే వ్యక్తులను పర్యవేక్షించే కెమెరా. మీరు ఏటీఎంవద్ద ఉన్నప్పుడు, మీ ప్రతి కదలికను పర్యవేక్షిస్తుంది.

ఏటీఎం లావాదేవీ సమయంలో ఏమి జరుగుతుందో దాని గురించి సమాచారం రికార్డ్ అవుతుంది.

 Do You Know How Many Tasks The CCTV Camera Details, Cash Withdraw People Bank, Atm, Cctv Camera, Atm Cctv Camers, Atm Machines, Banks, Money, Face Detection, Recognition System, Video Solution System-ఏటీఎంలోని సీసీ కెమెరా ఎన్ని ప‌నులు చేస్తుందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏటీఎం నుంచి చిరిగిన నోటు బయటకు వచ్చినా, నకిలీ నోటు దొరికినా కెమెరా ముందు చూపించ‌వ‌చ్చు.ఈ విధంగా మీ ఫిర్యాదు నమోద‌వుతుంది.తరువాత మీరు దానిని మార్చడానికి బ్యాంకు శాఖకు వెళ్లినప్పుడు, బ్యాంక్ అధికారి ఏటీఎం యొక్క ఫుటేజీని సాక్ష్యంగా చూడగ‌లుగుతారు.ఏటీఎంకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే బ్యాంకు అధికారి ఏటీఎం వద్దకు వెళ్లి ఫుటేజీకి సంబంధించిన ఫైల్‌ను కాపీ చేసి.

సెక్యూరిటీ కార్యాలయానికి తీసుకువస్తారు.

అప్పుడు అక్క‌డ ప‌రీక్షించి, కేసును సులువుగా పరిష్కరిస్తారు.

ఏటీఎంలలో అమర్చబడిన కెమెరాల రికార్డులు కేంద్రీకృత నిర్వహణ వ్యవస్థలో రికార్డ్ అవుతాయి.

Telugu Atm Cctv Camers, Atm, Banks, Cash, Cctv Camera, Face, System-Latest News - Telugu

ఈ సమాచారం అంతా బ్యాంక్ సర్వర్‌లో సురక్షితంగా ఉంటుంది.ఈ రోజుల్లో ఏటీఎం మెషీన్లు ఫేస్ డిటెక్షన్ మరియు రికగ్నిషన్ సిస్టమ్‌తో వస్తున్నాయి.ఏటీఎం ముందు నిలబడిన వ్యక్తి సరైనవాడా కాదా అనేది ఈ సిస్టమ్ తెలియజేస్తుంది.

బ్యాంకు రికార్డుల ప్రకారం ఎదురుగా నిల్చున్న వ్యక్తి ముఖం గుర్తించకపోతే, యంత్రం నుండి నగదు పంపిణీ చేయబడదు.ఈ వ్యవస్థ మోసపూరిత సంఘటనలను నివారిస్తుంది.భవిష్యత్తులో ఏటీఎం మెషీన్లలో ఆధునిక వీడియో సొల్యూషన్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేయబోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube