భారత్ లో వాట్సాప్ ను ఎంత మంది డిలేట్ చేసారో తెలుసా?

జుకర్ బర్గ్ చేతిలోకి వాట్సాప్ వెళ్లిన తరువాత అది ఎంతలా అభివృద్ధి చెందిందో మనం చూసాం.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు వాట్సాప్ ను వినియోగిస్తారు.

 Do You Know How Many People Have Deleted Whatsapp In India, Juken Burg, Whatsup-TeluguStop.com

అలా వాట్సాప్ ద్వారా కొన్ని వేల కోట్ల లావాదేవీల చర్చలు జరుగుతున్నాయి.ఇలా రాను రానూ వాట్సాప్ నుండి వాట్సాప్ బిజినెస్, వాట్సాప్ పే వెలువడ్డాయి.

ఇలా వినియోగదారులను రకరకాల సేవలను క్షణాల్లో అందిస్తూ వాట్సాప్ తప్ప ఇక వేరే యాప్ ను కూడా వాడడానికి ఇష్టపడలేదు.

ఇలా వాట్సాప్ పై తమ వ్యక్తిగత డేటాపై కూడా వినియోగదారులు నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

ఇలా కొనసాగుతున్న వినియోగదారులకు తమ వ్యక్తిగత సమాచారం గోప్యత విషయంలో ఝలక్ ఇచ్చేలా కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది.వాట్సాప్ కాంటాక్ట్స్ కూడా ఫేస్ బుక్ తో పంచుకునేలా అదేవిధంగా వాట్సాప్ బిజినెస్ లో కూడా కొత్త రూల్స్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపిన వాట్సాప్, ఈ విధంగా మేము తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అంగీకరించని వారికి వాట్సాప్ వినియోగించే అవకాశం ఉండదని తెలిపింది.

దీనిపై ఒక్కసారిగా వాట్సాప్ వినియోగదారులు, భారతప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సమయంలోనే ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడు ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్ లో అచ్చం వాట్సాప్ లాంటి సిగ్నల్ యాప్ ను వాడాలని ట్వీట్ చేసారు.

యూజ్ సిగ్నల్ అని ట్విట్టర్ లో తెలపడంతో ఒక్కసారిగా సిగ్నల్ డౌన్లోడ్స్ పెరగడం ఇలా చాలా సంఘటనలు జరిగాయి.వాట్సాప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల భారతీయులు వాట్సాప్ పై చాలా మందికి ఆగ్రహం కలిగింది.

ప్రస్తుతం వాట్సాప్ యూజర్ల సంఖ్య 40 కోట్లు కాగా అందులో 5 శాతం మంది అంటే సుమారు 2 కోట్ల మంది డిలేట్ చేసారని చెప్పవచ్చు.ఏది ఏమైనా వాట్సాప్ కు కొంత దెబ్బె అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube