30 నిముషాలు గడిచిన హీరో ఎంట్రీ ఇవ్వని సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

సినిమా విజ‌యంలో క‌థ‌, డైరెక్ట‌ర్ తో పాటు హీరో, హీరోయిన్ కీల‌క పాత్ర పోషిస్తారు.కొంత మంది డైరెక్ట‌ర్లు అయితే హీరోయిజాన్ని చూపించేందుకు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

 Do You Know How Many Movies Have Not Given Hero Entry In 30 Minutes-TeluguStop.com

అభిమానుల అంచ‌నాల‌ను రెట్టింపు చేసేలా ప్ర‌య‌త్నిస్తారు.హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ కోసం స్పెష‌ల్ అరెంజ్‌మెంట్స్ చేస్తారు.

హీరో ఎంట్రీ ఇస్తుంటే అభిమానుల సంద‌డితో సినిమా థియేట‌ర్లు ద‌గ్గ‌రిల్లేలా చూస్తారు.కొన్ని సినిమాల్లో హీరోలు మొద‌ట్లోనే తెర‌మీద ప్ర‌త్య‌క్షం అయిత మ‌రికొన్ని సినిమాల్లో మాత్రం చాలా సేప‌టికి హీరో ఎంట్రీ ఇస్తారు.అలాంటి మూడు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! హీరో లేటుగా వ‌చ్చినా ఈ సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డం విశేషం.
1.మ‌గాడుఈ సినిమా హీరో రాజ‌శేఖ‌ర్.ఇందులో హీరో చాలా లేటుగా వ‌స్తాడు.

 Do You Know How Many Movies Have Not Given Hero Entry In 30 Minutes-30 నిముషాలు గడిచిన హీరో ఎంట్రీ ఇవ్వని సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంత లేటుగా అంటే కాసేప‌ట్లో ఇంట‌ర్వెల్ అన‌గా తెర‌మీదికి వ‌స్తాడు.అప్ప‌టి వ‌ర‌కు మినిస్ట‌ర్ కిడ్నాప్ క‌థే వ‌స్తుంది.

ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ ఎంట్రీతో సినిమా ఊపందుకుంటుంది.సెకెండాఫ్ సైతం అద్భుతంగా ముందుకు సాగ‌డంతో ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

మ‌గాడు సినిమా షూటింగ్‌లోనే రాజ‌శేఖ‌ర్‌కు గాయాలు అయ్యాయి.సినిమా షూటింగ్‌లో భాగంగా బిల్డింగ్ మీది నుంచి దూకే స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తుండ‌గా జారిప‌డి హాస్పిట‌ల్ పాల‌య్యాడు.కోలుకుత‌న్న త‌ర్వాత సినిమా షూటింగ్ కంటిన్యూ చేశారు.

2.క్ష‌ణ‌క్ష‌ణంసెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది.హీరోగా విక‌ర్టీ వెంక‌టేష్ న‌టించాడు.

ఈ సినిమా వెంకీ కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా పేరు సంపాదించుకుంది.ఈ మూవీలో వెంక‌టేష్ దాదాపు అర‌గంట త‌ర్వాత క‌నిపిస్తాడు.

అప్ప‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ క‌థ‌గా సినిమా ముందుకు న‌డుస్తుంది.ఈ సినిమా అప్ప‌ట్లో దుమ్ములేపింది.

తెలుగు ఇండ‌స్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Telugu Captian Prabhakar, Magaadu, Rajashekar, Tollywood, Venkatesh, Vijaykanth-Telugu Stop Exclusive Top Stories

3.కెప్టెన్ ప్ర‌భాక‌ర్ఒక‌ప్ప‌టి సినీతార‌, ప్ర‌స్తుత పొలిటీషియ‌న్ రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి ఈ సినిమా డైరెక్ట‌ర్.విజ‌య్‌కాంత్ ఈ చిత్రంలో హీరోగా న‌టించాడు.

ఈ సినిమాలో సైతం హీరో ఎంట్రీ అర‌గంట త‌ర్వాతే ఉంటుంది.ప్ర‌భాక‌రన్ క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

మంచి క‌థ‌నంతో సాగిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

#Rajashekar #Venkatesh #Vijaykanth #Magaadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు