శాకుంతలం సినిమాలో సమంత ఎన్ని కిలోల బంగారం ధరించిందో తెలుసా... అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

Do You Know How Many Kilos Of Gold Samantha Wore In The Movie Shakunthalam The Director Told The Real Thing ,Vasundara Jewellery ,Samantha, Shakunthalam ,Gunasekhar, Tollywood

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం( Shakunthalam ).ఈ సినిమాలో సమంత( Samantha ) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

 Do You Know How Many Kilos Of Gold Samantha Wore In The Movie Shakunthalam The D-TeluguStop.com

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్( Gunasekhar ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో నటీనటులు నటించిన నగల గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో నటీనటులు ధరించిన నగలు అన్నీ కూడా నిజమైనవని ఈయన తెలియచేశారు.

సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన నిజమైన బంగారు కిరీటాన్ని ధరించారు దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో శకుంతల దుష్యంతుని పాత్రలలో నటించిన సమంత, దేవ్ మోహన్లకు కూడా నిజమైన బంగారు వజ్రా భరణాలను తయారు చేయించామని తెలియజేశారు.ఈ నగలను హైదరాబాద్లోని వసుంధర జ్యువెలర్స్( Vasundara Jewellery ) సారధ్యంలో ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారధ్యంలో సుమారు 7 నెలల పాటు కష్టపడి డిజైన్ చేయించారని తెలిపారు.ఇక ఈ సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నగలను వసుంధర జ్యువెలర్స్ లో ఆవిష్కరించినట్లు ఈయన తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో సమంత మొత్తం 14 రకాల ఆభరణాలను ధరించిందని ఈ నగలని సుమారు 15 కిలోల బరువు ఉంటాయని ఈయన తెలియజేశారు.ఇక దుష్యంతుడి మహారాజు పాత్రలో నటించిన దేవ్ మోహన్ కూడా సుమారు 8 నుంచి 10 కిలోల బంగారు ఆభరణాలను ధరించినట్లు గుణశేఖర్ వెల్లడించారు.ఇలా శకుంతల దుష్యంతుల బంగారు వజ్రాభరణాల కోసం సుమారు 14 కోట్ల వరకు ఖర్చు చేశామని ఈ సందర్భంగా గుణశేఖర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video : Vasundara Jewellery,Samantha,movie Shakunthalam ,Gunasekhar #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube