రాఘవేంద్ర రావు దగ్గర ఎంతమంది డైరెక్టర్లు శిష్యరికం చేశారో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంత ముఖ్యమో డైరెక్టర్ లు కూడా అంతే ముఖ్యం.ఒక సినిమా చేయాలంటే ముందుగా ఆ సినిమాకు దర్శకత్వం వహించే దర్శకుడు ఉండాలి.

 Do You Know How Many Directors Were Taken Training To The Raghavendra Rao Detail-TeluguStop.com

అలా ఒక సినిమాకు దర్శకుల నుంచి నటీనటుల వరకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు.

అందులో డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే.

తెలుగు సినీ రంగంలోనే స్టార్ దర్శకుడిగా నిలిచిన రాఘవేంద్ర రావు తన దర్శకత్వంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఈయన చేసిన సినిమాలన్నీ చాలావరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లోనే తెరకెక్కాయి.ఈయన దర్శకత్వంలో సినిమాలంటే ప్రేక్షకులే కాకుండా నటీనటులు కూడా బాగా ఎదురు చూస్తుంటారు.

ఈయన తీసుకున్న కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకుంటారు.

ఒకప్పటి స్టార్ హీరోలకు ఎన్నో మంచి అవకాశాలు ఇచ్చి వారిని స్టార్ హీరోలుగా మార్చాడు.ఆ తరం హీరోలలో కాకుండా ఈ తరం హీరోలకు కూడా దర్శకత్వం అందిస్తున్నాడు.

ఎంతో మంది డైరెక్టర్లకు రాఘవేంద్ర రావు బాధ్యతలు చేపట్టాడు.వారికి దర్శకత్వాన్ని నేర్పించి శిష్యులుగా మార్చుకున్నారు.

Telugu Gopal, Jayanth Farjani, Raghavendra Rao, Rajamouli, Tollywood, Directors,

ముందు రాఘవేంద్ర రావు పౌరాణిక బ్రహ్మ కమలకర కామేశ్వరరావు దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడు.ఆ తర్వాత తన తండ్రి కె ఎస్ ప్రకాష్ రావు దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ఇక మధుసూదన రావు దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు రాఘవేంద్రరావు.ఆ తర్వాత తాను కూడా ఎంతోమంది దర్శకులను పరిచయం చేశాడు.

Telugu Gopal, Jayanth Farjani, Raghavendra Rao, Rajamouli, Tollywood, Directors,

మొదట తన దగ్గర టాలీవుడ్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ఇక బి.గోపాల్ కూడా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలలో సహాయ దర్శకుడిగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.వీరిద్దరే కాకుండా కొంత మంది ఉండగా అందులో వైవిఎస్ చౌదరి కూడా రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడు.

Telugu Gopal, Jayanth Farjani, Raghavendra Rao, Rajamouli, Tollywood, Directors,

ఇక జయంత్ సి.పరాన్జీ కూడా పని చేశాడు.అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి కూడా రాఘవేంద్ర రావు దగ్గర దర్శకత్వం మెలకువలు నేర్చుకున్నాడు.అంతేకాకుండా రాఘవేంద్ర దర్శకత్వంలో కూడా సహాయ దర్శకుడిగా పని చేశాడు.

అలా ఆయన సపోర్టు తోనే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజమౌళి.

Telugu Gopal, Jayanth Farjani, Raghavendra Rao, Rajamouli, Tollywood, Directors,

అలా రాఘవేంద్ర రావు దగ్గర ఎంతోమంది శిష్యులు దర్శకులుగా పరిచయమై మంచి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆయన శిష్యులు అంతా ఇప్పుడు గురువులుగా మారారు.ఇటీవలే విడుదలైన పెళ్లి సందD సినిమా కూడా రాఘవేంద్రరావు పర్యవేక్షణలోనే రూపొందింది.

అంతేకాకుండా రాఘవేంద్రరావు ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటికీ ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాల కోసం మాత్రం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube