వంట‌ల‌క్క నిజ జీవితంలో తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే..!

బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారం అవుతున్న మెగా సీరియల్ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్.ఆ సీరియల్ ద్వారా ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా మంచి పేరు సొంతం చేసుకొని వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంటుంది.

 Premi Viswanathn, Baby, Kerala, Karthika Deepam Serial, Maa Tv,vinith Bhatt,kere-TeluguStop.com

ఇక కార్తీకదీపం సీరియల్ కు అంత క్రేజ్ రావడానికి ఒక ముఖ్య కారణం ప్రేమి విశ్వనాథ్ అని చెప్పవచ్చు.సీరియల్ లో దీప క్యారెక్టర్ లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది.

ప్రస్తుతం ఈ సీరియల్ బుల్లితెరపై చాలా రసవత్తరంగా కొనసాగుతోంది.దీప పిల్లలు అయిన సౌర్య హిమ చుట్టూ కొనసాగుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే.నిజ జీవితంలో ప్రేమి విశ్వనాథ్ కు ఎంత మంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా.!? అలాగే ఎప్పుడు షూటింగ్స్ లో చాలా బిజీ బిజీగా సమయాన్ని గడుపుతూ ఉన్న దీప తన పిల్లలకు సమయం కేటాయిస్తున్న విషయాలపై తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.ప్రేమి విశ్వనాథ్ ప్రముఖ ఆస్ట్రాలజర్ వినీత్ భ‌ట్‌ ను వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక వీరిద్దరికి ఒక బాబు ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.ప్రస్తుతం ఆమె బాబు ప్రేమి విశ్వనాధ్ తల్లి దగ్గర ఉన్నట్లు వాడి ఆలనాపాలనా మొత్తం కూడా ప్రేమి విశ్వనాథ్ అమ్మనే చూసుకుంటున్నట్లు తెలియజేసింది.

Telugu Baby, Karthikadeepam, Kerala, Maa Tv-Latest News - Telugu

ఇక ఇంటర్వ్యూలో భాగంగా షూటింగ్ సమయంలో మీ బాబును మిస్ అవుతున్నారా అని అడగగా.అదేమీ లేదంటూ సమాధానం ఇచ్చింది.తాను వీడియో కాల్స్ ద్వారా ఎప్పుడు బాబును పలకరిసస్తూ ఉంటానని, ఎప్పుడు మిస్ అవుతున్నట్లు అనిపించలేదని చెప్పుకొచ్చింది.ఇక కుటుంబ సభ్యుల కోసం ఒక వారం పాటు హైదరాబాద్ లో షూటింగ్ తో బిజీగా ఉంటే, మరో వారం కేరళలో ఉన్న తన కుటుంబంతో తన సమయాన్ని గడుపుతున్నట్లు ఆమె తెలిపింది.

ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ లో నటిస్తుండగా అతి త్వరలోనే వెండితెరపై ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షం రాబోతుంది.ఈ మధ్యనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

ఆ సినిమాలో ప్రేమి విశ్వనాథ్ ఒక పోలీసు నటించబోతున్నట్లు, సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube