కరెన్సీ నోట్లపై కరోనా ఎంత కాలం ఉంటుందో తెలుసా?

కరోనా వైరస్ ఎక్కడో వుహాన్ లో పుట్టి, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది.రోజుకొక కొత్త లక్షణంతో ఈ వైరస్ వ్యాప్తి అధికమవుతోంది.

 Coronavirus Could Stay For Weeks On Currency Notes , Coronavirus, Currency Notes-TeluguStop.com

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇది వరకే తెలిసిన విషయం.ఈ వైరస్ అలా వ్యాప్తి చెందడమే కాకుండా ,మనం నిత్యం వాడే వస్తువులపై కూడా ఎక్కువ రోజులు జీవించి ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

అయితే ఈ వైరస్ కరెన్సీ నోట్లపై దాదాపుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు జీవించి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వైరస్ జీవించి ఉండదని భావించి కొందరు ఈ కరెన్సీ నోట్లను వాషింగ్ మిషన్ లో వేయడం,లేదా శానిటైజర్ తో కడగడం, ఐరన్ బాక్స్ తో హీట్ చేయడం వంటి పనులు చేసి కొంత వరకు వారి డబ్బును కోల్పోయారు.

అలా చేస్తే వైరస్ చనిపోతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే.ఈ వైరస్ 40 డిగ్రీల వద్ద కూడా ఒక రోజు పాటు జీవించిఉంటుంది.అలాంటిది ప్లాస్టిక్ వస్తువుల పై కన్నా కరెన్సీ నోట్ల వంటి సున్నితమైన ఉపరితలాలపై ఈ వైరస్ 28 రోజుల పాటు జీవించి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

ఈ కరెన్సీ నోటు ద్వారా కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

అందువల్ల మనం కరెన్సీ నోట్ల కు బదులుగా డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్ధతిలో డబ్బును వాడటం వల్ల కొంతవరకు వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.రానున్న రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ వ్యాధి మరింత ప్రబలే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు, గ్లౌజ్, శానిటైజర్ లు తప్పకుండా వాడటమే కాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube