మీ ఫోన్ లో గూగుల్ ప్లే సర్వీసెస్ ఎలా ఉపయోగపడుతాయో తెలుసా..?  

do you know how google play services can be used on your phone google play services, android mobiles, smart phones, applications, task manager - Telugu Android Mobiles, Applications, Google Play Services, Smart Phones, Task Manager

మనలో చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తూనే ఉన్నారు.అయితే చాలా మందికి వారి ఫోన్ లో గూగుల్ ప్లే సర్వీసెస్ గురించి చాలా మందికి తెలియదు.

TeluguStop.com - Do You Know How Google Play Services Can Be Used On Your Phone

నిజానికి మన స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లే సర్వీసెస్ నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేయబడుతూనే ఉంటాయి.అసలు ఈ గూగుల్ ప్లే సర్వీసెస్ ఎందుకు ఉపయోగిస్తారో అన్న సంగతి చూస్తే…

మన స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ కు సంబంధించి ఏవైనా కీలకమైన సర్వీసులకు అనుసంధానం చేయడం కోసమే ఈ గూగుల్ ప్లే సర్వీస్ ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది.

TeluguStop.com - మీ ఫోన్ లో గూగుల్ ప్లే సర్వీసెస్ ఎలా ఉపయోగపడుతాయో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి ఒక ఉదాహరణ చూస్తే.మనం మొబైల్ లో ఏదైనా క్యాబ్ బుకింగ్ అప్లికేషన్ ఉపయోగిస్తే అందులో కచ్చితంగా గూగుల్ మ్యాప్స్ కు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

అప్పుడు గూగుల్ మ్యాప్స్ కు సక్రమంగా కనెక్ట్ అయి ఉంటేనే మనకు ఆ క్యాబ్ బుకింగ్ అప్లికేషన్ పనిచేస్తుంది.మరి ఆ యాప్ గూగుల్ మ్యాప్స్ కు అనుసంధానం కల్పించే సర్వీసే గూగుల్ ప్లే సర్వీసెస్.

ఇవి ఎప్పుడు మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి.అయితే ఇలా బ్యాక్ గ్రౌండ్ లో గూగుల్ ప్లే సంబంధించిన సర్వీసెస్ రన్ అవ్వడం ద్వారా మొబైల్ బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది అని అనేక మంది అపోహ.

అయితే ఇందుకు ప్రధాన కారణం గూగుల్ ప్లే సర్వీస్ కానేకాదు.దీనికి కారణం మనం వాడిన అప్లికేషన్స్ పూర్తిగా క్లోజ్ చేయకుండానే బయటికి వస్తుంటాం.అలాంటి సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ బ్యాటరీని తగ్గించే ప్రయత్నంలో ఉంటాయి.కాబట్టి ముఖ్యంగా అలా వదిలేసిన యాప్స్ ను టాస్క్ మేనేజర్ లోకి వెళ్లి తొలగించడం ద్వారా బ్యాటరీని కాపాడుకోవచ్చు.

అలాగే ఎక్కువ ఉపయోగించని ఆప్షన్ కూడా తెలుసుకుని వాటిని ముందుగా డిసేబుల్ చేయడం ద్వారా ఒకవైపు డేటాను మరో వైపు బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు.

#Android Mobiles #GooglePlay #Task Manager #Applications #Smart Phones

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Do You Know How Google Play Services Can Be Used On Your Phone Related Telugu News,Photos/Pics,Images..