చిరంజీవి చెల్లి సంయుక్త ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా ?

80, 90 వ దశకంలో ఏ హీరో కైనా చెల్లి పాత్ర చేయాలంటే అప్పట్లో ఉన్న అందరి దర్శక నిర్మాతలు గుర్తొచ్చే ఏకైక పేరు సంయుక్త .నటి సంయుక్త అంటే మీకు అట్టే గుర్తు రాకపోవచ్చు కానీ నిన్నటి తరం ప్రేక్షకులకు మాత్రం బాగా తెలిసిన నటి.

 Do You Know Family Details Of Actress Samyuktha Samyuktha, Chiran Jeevi, Tollywood, Nitya Ravichandran, Kollywood, Marrege, Khidhi, Manavudu Danavudu,swayamkrushi-TeluguStop.com

సంయుక్త అసలు పేరు నిత్య రవీంద్రన్.నిజానికి ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయింది హీరోయిన్ గా కొన్నాళ్లపాటు బాగానే నడిచిన, ఆ తర్వాత వయసు మీద పడటంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

ఇక ఆ తర్వాత కేవలం సినిమాలే కాదు ఆమె తన ప్రతిభను బుల్లితెరపై కూడా ప్రస్తుతం చూపిస్తోంది.ఇలా నిరంతరాయంగా అంటే ఏకంగా 5 దశాబ్దాలుగా ఆమె బుల్లితెర, వెండి తెర పై విజయవంతమైన నటిగా కొనసాగుతోంది.

 Do You Know Family Details Of Actress Samyuktha Samyuktha, Chiran Jeevi, Tollywood, Nitya Ravichandran, Kollywood, Marrege, Khidhi, Manavudu Danavudu,swayamkrushi-చిరంజీవి చెల్లి సంయుక్త ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి సంయుక్త కేవలం ఒక తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ భాషలో కూడా అనేక సినిమాల్లో చెల్లెలి పాత్రలోనే ఎక్కువగా నటించి అందరిని అలరించింది.ఇక మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో చెల్లి పాత్రల్లో నటించింది.

ముఖ్యంగా న్యాయం కావాలి, ఖైదీ, మీరే చెప్పాలి, మానవుడు దానవుడు, స్వయంకృషి ఈ సినిమాలన్నిటిలోనూ చిరంజీవికి చెల్లిగా సంయుక్త నటించింది, ఇవన్నీ కూడా మనందరికీ బాగా గుర్తుండిపోయిన సినిమాలంటే అతిశయోక్తి కాదు.ఈ విధంగా మన తెలుగింటి సినిమాకు తను ఆడపడుచు గా మిగిలిపోయింది.

ఇక ఉన్నట్టుండి కొన్నాళ్ల క్రితం ఆమె సినీ పరిశ్రమ నుంచి ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి పూర్తిగా దూరమైపోయింది.ఎందుకంటే ఆమెకు తమిళం, మలయాళం ఇండస్ట్రీలో ఎక్కువ తల్లి పాత్రలు చేస్తూ రావడమే దీనికి ముఖ్యమైన కారణం.

ఇక ఇటీవల సోషల్ మీడియా వ్యాప్తి బాగా పెరిగిపోయింది.దాంతో ఆమె భర్త, ఆమె ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆమె కుటుంబ విషయానికొస్తే సంయుక్త భర్త పేరు రవీంద్రన్ అతడు కూడా మనకు బాగా తెలిసిన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలకు ఆయన పనిచేశాడు ఇక సంయుక్త రవి చంద్రన్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

సంయుక్త కొడుకు పేరు అర్జున్ కాగా, కూతురు పేరు జనని.సంయుక్త తన కొడుకును కూడా ఇండస్ట్రీకి తీసుకురావడం విశేషం తను ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నాడు ఇక కూతురిని మాత్రం చదువుకే పరిమితం చేసింది ఎందుకంటే ఆమెకు కేవలం చదువు అంటేనే ఇష్టం అని, ప్రస్తుతం యు ఎస్ లో సెటిల్ అయ్యిందని తెలిపింది.

ఇక సంయుక్త విషయానికి వస్తే ఆమె మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube