ఈ గ్రామంలో గబ్బిలాలకు పూజ చేస్తారు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా మనం గబ్బిలాలను చూస్తే ఆమడ దూరం వాటిని తరుముతాము.గబ్బిలాలు వివిధ రకాల వ్యాధులకు కారణమని భావించి వాటిని మన ఇంటి చుట్టూ తిరగనివ్వం.

 Do You Know Bats Was Worshiped In Kadapa-district Kadapa, Bats Worshiped, Andhra-TeluguStop.com

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో మాత్రం గబ్బిలాలను దైవ సమానంగా భావించి గబ్బిలాలు ఉన్నటువంటి చెట్టుకు పూజలు చేస్తున్నారు.కేవలం ఆ గ్రామంలోని ప్రజలు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని గబ్బిలాలు ఉన్నటువంటి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ విధంగా గబ్బిలాలు ఉన్న చెట్టుకు పూజలు చేయడం ఏమిటి? పూజలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా,రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు గ్రామం ఉంది.

ఈ గ్రామంలోని మర్రి చెట్టు పై వందలాది గబ్బిలాలు నివసిస్తుంటాయి.ఈ విధంగా గబ్బిలాలు వాలిన ఈ చెట్టుకు ఆ గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఈ చెట్టుకు పూజలు నిర్వహించడానికి కూడా ఒక కారణం ఉంది.ఒకప్పుడు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలు సంభవించడమే కాకుండా, ఈ గ్రామంలో ముఠా కక్షలు పెద్ద ఎత్తున ఉండేవి.

ఇలాంటి సమయంలోనే ఈ గ్రామంలోకి ఒకరోజు వందలాది గబ్బిలాలు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు పైకి వచ్చాయి.

Telugu Andhra Pradesh, Bats, Bats Worshiped, Kadapa, Madhavaram-Telugu Bhakthi

ఈ విధంగా ఊరి చివర ఉన్న ఈ గబ్బిలాలు క్రమక్రమంగా ఊరిలో ఉన్న కొన్ని చెట్లపై వాలేవి.ఈ విధంగా గబ్బిలాలు ఊరులోకి ప్రవేశించిన తర్వాత ఊరిలో కరువు తొలగిపోవడమే కాకుండా, ఊరిలో ముఠా కక్షలు పూర్తిగా తగ్గిపోయాయి.అదేవిధంగా పంట పొలాలతో బాగా అభివృద్ధి చెందడంతో గ్రామస్తులందరూ గబ్బిలాలు ఊరిలోకి రావటం వల్లే వారి గ్రామం సుభిక్షంగా ఉందని భావించినప్పటి నుంచి ఆ మర్రి చెట్టుకు పూజలు చేయడం ప్రారంభించారు.

అదేవిధంగా ఆ గ్రామంలోని ఎవరికైనా చిన్నపిల్లలకు పక్షిదోషాలు ఉండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంట చిన్నపిల్లలను ఆ చెట్టు వద్దకు తీసుకెళ్లి పూజలు చేయించడం, గబ్బిలాలు ఎముకలను పిల్లల మెడలో కట్టడంవల్ల పిల్లలకు పక్షులు దోషాలు తొలగిపోయి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామానికి చేరుకుని ఈ చెట్టుకు పూజలు చేస్తారు.

అయితే ఇన్ని రోజుల నుంచి గబ్బిలాలు అదే ఊరిలో ఉంటున్నప్పటికీ వాటి వల్ల ఏ ఒక్కరికి కూడా నష్టం కలిగించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube