ఆ దోమ చాలా స్పెషల్ గురు..!

మనిషిని ఏదైనా కుడితే వెంటనే ఆ ప్రదేశాన్ని మనిషి గట్టిగ కొట్టి కుట్టినదాన్ని చంపేస్తాడు.అంతలా ఆ నిమిషం కోపం వస్తుంది.

 Do You Know Anything About World Beautiful Mosquito, World Beautiful Mosquito, W-TeluguStop.com

ఇలా మనిషిని కుట్టి ఒక్క నిమిషంలో కోపం తెప్పించేవి చీమ, దోమ.ముఖ్యంగా దోమ కుడితే ఇంకా భయంగా ఉంటుంది.ఎందుకంటే దోమ కొట్టడంతో అనేగా రోగాలు వస్తాయి.డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి అనేక వ్యాధులు దోమలు కుట్టడం వల్లే వస్తాయి.అంతేకాదు వీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వచ్చే అవకాశం ఉంది.అందుకే ప్రభుత్వాలు సైతం దోమల మందుని వదులుతారు.

దోమ శరీరం మీద కనిపిస్తే చాలు చంపేస్తారు.

అనేక దేశాల్లో దోమ కనపడితే చాలు చంపేస్తారు.

కానీ ఓ రకం దోమని మాత్రం మనం చంపలేం అనుకోమంటా.చంపడం పక్కన పెడితే ఆ దోమని చూస్తూ కూర్చుండిపోతామట.

అంత అందంగా ఆ దోమ ఉంటుందట.ఇలాంటి దోమలు కూడా ఉంటాయా అని కొంచెం కొత్తగా ఉంది కదా.ఇంతకీ ఈ దోమను ఎందుకు చంపాలనిపించదో ఒకసారి తెలుసుకుందాం.ఆ దోమ పేరు ”సభేథెస్ దోమ”.

ఇటువంటి దోమలు ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్టమండల అడవుల్లో కనిపిస్తాయి.దీని కుటుంబం కొంచెం వింతగా ఉంటుంది.

అయితే ఈ దోమ వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తాయి.రంగుల ఈకలు, ఆకుపచ్చ రంగు దేహం, కలర్స్ కాళ్లతో అందంగా కనిపించే ఈ దోమ ఫోటోని కెనడాలోని వంటారియోకి చెందిన గిల్ విజేం తీశారు.

Telugu Gill Vijem, Photographer, Meida, Latest, Wildlife-Latest News - Telugu

అయితే ఈ ఫోటో అతనికి అంత ఈజీగా దొరకలేదు.ఎన్నో దోమలతో కుట్టించుకుంటేనే ఈ అందమైన దోమ ఫోటోని తీయగలిగాడు.అయితే అతని కష్టం ఊరికే పోలేదు.ఈ ఏడాది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో ఈ ఫోటో తీసినందుకు ప్రశంసలు పొందారు.ఆయన మాట్లాడుతూ.ఈ దోమను ఫోటో తీయాలంటే చాలా కష్టమని తెలిపారు.

ఈ దోమలు ఎప్పుడు గుంపుగానే ఉంటాయని సమాచారం.కాగా ఇప్పుడు ఈ దోమలపై మరింత పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube