పుణ్యాన్ని ప్రసాదించే పురుహూతిక శక్తి పీఠం ఎక్కడ ఉందో తెలుసా?

పురాణాల ప్రకారం పార్వతి దేవి మరణించిన తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పార్వతి దేవి శరీరాన్ని ఖండించినపుడు ఆమె శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో ఆలయాలు వెలిశాయని వాటిని శక్తిపీఠాలుగా భావిస్తాము.ఈ విధంగా వెలిసిన ఆలయాలలో 18 శక్తి పీఠాలు ఎంతో పవిత్రమైనవి.అందుకే వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు.16 శక్తి పీఠాలు మన దేశంలో ఉండగా రెండు శక్తిపీఠాలు ఒకటి శ్రీలంక ఒకటి పాకిస్తాన్ లో ఉన్నాయి.ఈ 16 శక్తి పీఠాలలో 1 తెలుగు రాష్ట్రంలో వెలిసింది.మరి ఆ శక్తి పీఠం ప్రాముఖ్యత ఏమిటి అక్కడ అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారు? ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

 Do You Know Anything About Puruhotika Devi Temple-TeluguStop.com

కాకినాడకు దగ్గరగా ఉన్నటువంటి పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం.నాటి మహారాజుల భవనాలు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి.

వీటితోపాటు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీపురుహూతిక పీఠం కూడ కాలగర్భంలో కలసి పోయింది.విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసినప్పుడు అమ్మవారి పిరుదులు ఈ ప్రదేశంలో పడటం వల్ల ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీపురుహూతిక దేవిగా భక్తులు పూజించే వారు.

 Do You Know Anything About Puruhotika Devi Temple-పుణ్యాన్ని ప్రసాదించే పురుహూతిక శక్తి పీఠం ఎక్కడ ఉందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అష్టాదశ శక్తిపీఠాలలో ఈ ఆలయాన్ని పదవ శక్తిపీఠంగా భావించేవారు.

Telugu Kaki Nada, Parvathi Devi, Puruhotika Devi Temple, Vishnu Murthy-Telugu Bhakthi

పురాణాల ప్రకారం ఈ ఆలయంలో వెలసిన అమ్మవారికి ఇంద్రుని చేత పూజింపబడినది.1998 సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో అమ్మవారికి నిత్యపూజలు కుంకుమార్చన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.

ముఖ్యంగా ఆశ్వీజమాసంలో నిర్వహించే దేవీనవరాత్రుల ఉత్సవాలను ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.మనదేశంలోనే పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.ఈ ఆలయంలో కుక్కుటేశ్వరస్వామి స్వయంభూగా వెలిశారు.దక్షిణ కాశీ గా పేరుపొందిన ఈ ఆలయంలో హోమాలు, అధ్యయనం, శ్రాద్ధం, దేవతార్చనలు, వ్రతాలు మొదలగునవి చేయటం వల్ల అమ్మవారు అనుగ్రహం చెంది మనకు కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని అది ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

#PuruhotikaDevi #Vishnu Murthy #Parvathi Devi #Kaki Nada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU