టీచర్ నుంచి 'స్టార్'గా ఎదిగిన వ్యక్తి ఎవరో తెలుసా?

చాలా మంది స్టార్ లు తమ నిజ జీవితంలోపైకి ఎదగడానికి ముందు కొన్ని వృత్తిపరమైన రంగాలలో పని చేసేవారు.సినిమాలలో ఉన్న ఆసక్తి కోసం తమ వృత్తి రంగాలను వదులుకొని మరీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు.

 Do You Know Who Has Grown From A Teacher To A 'star'?, Teacher,actor,my Village-TeluguStop.com

కాగా ఇక్కడ ఓ సమాన్యమైన వ్యక్తి….విద్యను పంచె టీచర్ నుండి స్టార్ గా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నారు.

సోషల్ మీడియా మాధ్యమిక మైన యూట్యూబ్ ను తన వేదికగా మార్చుకొని స్టార్ గా నిలుస్తున్న వ్యక్తి ‘అనిల్ జీల’.

సిద్దిపేట దర్గా పల్లి గ్రామానికి చెందిన అతను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.

కొండగట్టు దగ్గర ఉన్నా గ్రామంలో టీచర్ గా విద్యను అందించారు.పూర్తిస్థాయిలో తాను గవర్నమెంట్ టీచర్ గా ఉండాల్సిన సమయంలో యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు.

టెట్ లో మంచి ర్యాంకు సాధించిన తాను అప్పట్లోనే ‘యూట్యూబ్’లో షార్ట్ ఫిలిం తీయడం మొదలు పెట్టాను అని తెలిపారు.

అంతేకాకుండా తొందరగా వెళ్లాలంటే ఒక్కడివి వెళ్ళు… దూరంగా వెళ్లాలంటే నలుగురితో కలిసి వెళ్ళు అనే మాటను తన చిన్నప్పటి టీచర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని యూట్యూబ్ లో ‘మై విలేజ్ షో ‘ పేరు తో తన స్నేహితులతో మరియు బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వతో కలిసి షార్ట్ ఫిలింలను తీస్తున్నారు.

దాదాపు 250కి పైగా షార్ట్ ఫిలిం లను తీసి మంచి పేరు సంపాదించుకున్న అనిల్ మరో యూట్యూబ్ ఛానల్ ‘అనిల్ జీల వ్లాగు’ అనే పేరుతో గ్రామాలకు, వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో విద్యకు సంబంధించిన విషయాలను తెలుపుతున్నారు.

అనిల్ కు సినిమాలలో హీరో గా నటించాలనే కోరిక ఉండటం తో… అంత సాధ్యమయ్యే విషయం కాదని… షార్ట్ ఫిలింలో తమంత తామే హీరోగా నటిస్తున్నారు.

అంతేకాకుండా అనిల్ కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఒక సామాన్యమైన వ్యక్తి టీచర్ గా జీవితాన్ని సాగే క్రమంలో…అనుకోని సంఘటనల వల్ల….

తన జీవితం ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా , సినిమాల్లో కొన్ని పాత్రలతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube