ఈ రేంజ్ లో వ్యాయామం చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది వారి శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారించారు.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు వారి శరీరాకృతిని కాపాడుకోవడానికి కోసం ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతూ.

 Do You Know Any Heroine Doing Exercising In The High Level-TeluguStop.com

ఎంతో కష్టతరమైన వ్యాయామాలు చేస్తూ వారి శరీరాన్ని ఫిట్ గా ఉండడం కోసం తాపత్రయపడుతున్నారు.ఇక శరీర ఫిట్నెస్ విషయంలో సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హీరో హీరోయిన్స్ ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ శరీరాకృతి పై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.ఇలా చాలా మంది హీరోయిన్ లు ఎక్కువగా జిమ్ లో ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు.

 Do You Know Any Heroine Doing Exercising In The High Level-ఈ రేంజ్ లో వ్యాయామం చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా అలాంటి ఫోటోలు షేర్ చేసింది మన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైంది ఈ చిన్నది.ఒకప్పుడు ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంటే అలియా భట్ నటించిన మొదటి సినిమా కోసం ఏకంగా 16 కిలోల బరువు తగ్గిన విషయం మనకు తెలిసిందే.

Telugu Exercising, Heroine, Instagram, Social Media, Tollywood, Viral-Movie

నిత్యం తన శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారించే అలియా భట్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా వ్యాయామం చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఇందులో ఈమె ఏకంగా ఒక రింగ్‌పై శరీరాన్ని పూర్తిగా మంచి వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోంది.ఈ వర్కౌట్ కి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.పర్ఫెక్షన్ సాధించాను అంటూ క్యాప్షన్స్ జోడించారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

#Social Media #Heroine #Exercising #Instagram #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు