ఏపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల హామీలు ఎలా ఉన్నాయంటే ?

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల హామీలు ఇస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటాయి.మేము అధికారంలోకి రాగానే ఫలానా ఫలానా పనులు చేయబోతున్నాము అంటూ హామీలు ఇస్తూ ప్రజలను తమవైపుకు తిప్పుకుని తద్వారా ఓట్లు పొందాలని చూస్తుంటాయి.

 Do You Know All Ap Political Parties Main Manifesto-TeluguStop.com

అందుకే ఒక పార్టీ మ్యానిఫెస్టోను మించి ఉండేలా తమ మ్యానిఫెస్టోను తయారుచేస్తుంటాయి.

ఇందులో ప్రజల సంక్షేమం గురించి ఎలా ఉన్నా ప్రత్యర్థుల కన్నా తాము మెరుగైన హామీలు ఇచ్చాము అని చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి.

అందుకే అమలు సాధామా కదా అని ముందు వెనుక ఆలోచించకుండా హామీలు ఇస్తున్నాయి.ఆ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే గెలిచాక చూద్దాం లే ప్రస్తుతానికి అధికారం దక్కితే చాలు తరువాత సంగతి ఆ తరువాత చూద్దాం అన్నట్టుగా హామీల వర్షంలో ఓటర్లను తడిపేస్తుంటాయి.

ఇప్పటికే జనసేన తమ పార్టీ తరపున మ్యానిఫెస్టో ఎలా ఉండబోతోంది అనేది ప్రకటించింది.టీడీపీ తమ పార్టీ మ్యానిఫెస్టో రూపొందించుకున్నా, వైసీపీ ప్రకటించిన తరువాత మార్పు చేర్పులు చేసి ప్రకటించాలని చూస్తోంది.

వైసీపీ కూడా అదే విధంగా ఆలోచిస్తోంది.ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ప్రకటిస్తున్న హామీలు ఒకసారి చూద్దాం.

టీడీపీ హామీలు :


* 2019 నాటికి పోలవరం పూర్తి
* కరవు లేని ఆంధ్రప్రదేశ్
* 40 లక్షల ఎకరాలకు సాగునీరు
* ఐదు నదులను కలిపేసి, కరవుకు చెక్

* రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 9 గంటల ఫ్రీ కరెంట్‌ని 12 గంటలకు పెంపు
* సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
* చివరి ఆయకట్టు రైతులకూ నీరు
* రైతుల్ని ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ మరో ఐదేళ్లు పొడిగింపు
* ధరల పతనం, దళారులకు చెక్ పెట్టేందుకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు
* యువనేస్తంలో ఇచ్చే నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచీ రూ.2000కు పెంపు
* నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్
* పింఛన్లు రూ.2000 నుంచీ రూ.3000కు పెంపు
* 300 చదరపు గజాల స్థలం ఉంటే, ఫ్రీగా ఇంటి నిర్మాణం.
* పసుపు కుంకుమ పథకం కింద ఇస్తున్న రూ.10000 కొనసాగింపు

వైసీపీ హామీలు:


* నవరత్నాల హామీలు అమలు
* రైతులకు 12 గంటలు పగటిపూట ఫ్రీ కరెంట్
* రైతులకు వడ్డీ లేని రుణాలు
* ఏడాదికి రూ.12500 చొప్పున రైతుకు పెట్టుబడి సాయం
* రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* సహకార డెయిరీలకు లీటర్ పాలకు రూ.4 పెంపు

* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు పన్ను రద్దు
* రైతులకు వైఎస్సార్ భీమా కింద రూ.5 లక్షల భీమా
* ప్రతి పార్లమెంట్ స్థానాన్నీ ఒక జిల్లాగా 25 జిల్లాల ఏర్పాటు
* గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటు, పది మంది స్థానికులకు ప్రతి గ్రామంలో ఉద్యోగాలు
* జలయజ్ఞం కింద ప్రాజెక్టలన్నీ పూర్తి
* రూ.4000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం సక్రమంగా అమలు
* బడికి పంపే పిల్లల కోసం ఏడాదికి రూ.15000
* మూడు దశల్లో మద్యపాన నిషేధం
* ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే
* హాస్టల్ ఫీజు కోసం ఏడాదికి రూ.20000
* పెన్షన్ దారుల వయస్సు 45 ఏళ్లకు తగ్గింపు
* పెన్షన్లు రూ.2000 నుంచీ రూ.3000కు పెంపు
* పేదలందరికీ ఇల్లు
* సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ

జనసేన హామీలు:


* మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు
* గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
* రేషన్‌కి బదులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.2500-రూ.3500 మధ్య నగదు జమ
* బీసీలకు 5% రిజర్వేషన్ల పెంపు

* కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
* ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు కార్పొరేషన్
* ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
* ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు
* వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు
* అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు
* ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన
* ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు
* డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
* నదుల అనుసంధానం, కొత్త జలాశయాల నిర్మాణం
* మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంక్
* వేటకు వెళ్లని రోజు రూ.500 ఆర్థిక సాయం
* అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అందరికీ తాగునీరు
* భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు
* ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు
* ప్రతి మండపానికీ కల్యాణ మండపం నిర్మాణం
* మహిళలకు పావలా వడ్డీ రుణాలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube