ఆర్ఆర్ఆర్ సినిమాకు అలియా భట్ పారితోషికం ఎంతో తెలుసా?

Do You Know Alia Bhatts Remuneration For Rrr Movie

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

 Do You Know Alia Bhatts Remuneration For Rrr Movie-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయగా అలియాభట్ సీత పాత్రలో కనిపించనున్నారు.

మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఈమె ఈ సినిమాలో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇలా పదిహేను నిమిషాలు కనిపించడం కోసం ఏకంగా ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

 Do You Know Alia Bhatts Remuneration For Rrr Movie-ఆర్ఆర్ఆర్ సినిమాకు అలియా భట్ పారితోషికం ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ పొందాలంటే తప్పనిసరిగా ఈమెను తీసుకోవాల్సి ఉండటంతో నిర్మాతలు కూడా ఈమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

Telugu Alia Bhat, Jr Ntr, Ram Charan, Tollywood-Movie

ఈ సినిమా కోసం అలియా భట్ కేవలం పది రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చిందని పది రోజులకు గాను ఈమె ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే జనవరి 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు పెద్దఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.

#Alia Bhat #Ram Charan #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube